కంటి చూపుతో పాటు మెదడు పనితీరును మెరుగుపరిచే మ్యాజికల్ జ్యూస్ మీకోసం!

ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందిలో కంటి చూపు అనేది మందగిస్తోంది.దీని కారణంగా కళ్లద్దాలపై ఆధారపడుతున్నారు.

 A Magical Juice That Improves Eyesight As Well As Brain Function Is For You! Eye-TeluguStop.com

ఒత్తిడి, పోషకాల కొరత, మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించడం, గంటలు తరబడి కూర్చుని టీవీ చూడటం వంటి కారణాల వల్ల కంటి చూపు తగ్గిపోతుంటుంది.ఈ స‌మ‌స్య‌కు అడ్డుకట్ట వేయడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ జ్యూస్ ను తీసుకుంటే కంటి చూపు రెట్టింపు అవడంతో పాటు మెదడు పనితీరు మెరుగుపడుతుంది.అలాగే మరిన్ని హెల్త్‌ బెనిఫిట్స్ ను సైతం పొందొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం కంటి చూపును పెంచే ఆ మ్యాజికల్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది చూసేయండి.ముందుగా క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే రెండు ఉసిరికాయలను తీసుకుని వాటర్ తో వాష్ చేసి గింజ తొల‌గించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

మరియు అర అంగుళం పచ్చి పసుపు కొమ్ము తీసుకుని పీల్ తొలగించి పెట్టుకోవాలి.

Telugu Brain, Tips, Healthy, Latest-Telugu Health

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్‌ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉసిరి ముక్కలు, పచ్చి పసుపు కొమ్ము మరియు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్‌ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి సేవించాలి.

మ్యాజికల్ జ్యూస్ ను వారంలో మూడు సార్లు కనుక తీసుకుంటే కంటి చూపు తగ్గడం కాదు రెట్టింపు అవుతుంది.ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే కళ్ళద్దాలతో అవసరమే ఉండదు.

వ‌య‌సు పైబ‌డిన సరే కళ్ళు చక్కగా కనిపిస్తాయి.

Telugu Brain, Tips, Healthy, Latest-Telugu Health

అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా సాగుతుంది.డిప్రెషన్ ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.రోగ‌నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా కాంతివంతంగా మారుతుంది.జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.

మరియు బాడీ డీటాక్స్ సైతం అవుతుంది.కాబట్టి ఈ మ్యాజికల్ జ్యూస్ ను తప్పకుండా డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube