మన దేశ వ్యాప్తంగా మహాశివరాత్రిని ప్రజలందరూ ఎంతో సంతోషంగా, వైభవంగా జరుపుకుంటారు.మహాశివరాత్రి పండుగ రోజు దాదాపు చాలామంది ప్రజలు శివునికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు.అయితే మహాశివరాత్రి రోజు పార్వతి, పరమేశ్వరుల వివాహం జరిగిందని చెబుతూ ఉంటారు.
ఈ మహాశివరాత్రి రోజు శివలింగాన్ని పూజించడం వల్ల కష్టాలు దూరమైపోయి జీవితంలోకి సుఖసంతోషాలు వస్తాయని వేద పండితులు చెబుతుంటారు.అయితే పరమేశ్వరుడికి సింధూరం గాని, పసుపు, తులసిని సమర్పించకూడదన్న సంగతి చాలా మందికి తెలియదు.
అంతేకాకుండా శివలింగంపై శంఖం నుంచి నీటిని కూడా అస్సలు సమర్పించకూడదు.ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సింధూరాన్ని సమర్పించకూడదు.వాస్తవానికి హిందూ మతంలో స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం సింధూరాన్ని పెట్టుకుంటారు.అయితే మహా శివుని రూపాన్ని కూడా వినాయకుడిగా భావిస్తారు.వాటి స్వభావం కారణంగా శివలింగానికి సింధూరం సమర్పించకూడదని పురాణాలు చెబుతున్నాయి.అంతేకాకుండా హిందూమతంలో పసుపును స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు.అయినప్పటికీ శివరాధనలో దీన్ని అసలు ఉపయోగించకూడదు.
పురాణాల ప్రకారం పసుపు స్త్రీలకు ప్రతీక అందువల్ల పరమేశ్వరుడికి పసుపును సమర్పించకూడదు.
మహాశివరాత్రి రోజున మాత్రమే కాకుండా ఏ రోజు కూడా శివుడికి పసుపుని సమర్పించకూడదు.ఇంకా చెప్పాలంటే పూర్వజన్మలో తులసి రాక్షస వంశంలో జన్మించింది.ఆమె పేరు బృందా.
ఈమె విష్ణువుకు పరమ భక్తురాలు.అయితే ఈమె జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంది.
జలంధర్ తన భార్య భక్తి కారణంగా అమరుడయ్యే వరం పొందాడు.అయితే ఒకసారి జలంధర దేవతలతో యుద్ధం చేస్తాడు.
అప్పుడు బృందా తన భర్త గెలవాలని విష్ణు ఆరాధనలో ఉంటుంది.ఆమె భక్తి, ఉపవాసం వల్ల జలంధర్ యుద్ధంలో గెలుస్తాడు.
అప్పుడు శివుడు జలంధరును చంపుతాడు.భర్త మరణంతో చాలా బాధపడిన బృందా కోపంతో శివుడి ఆరాధనలో తులసినీ ఉపయోగించకూడదని శపిస్తుంది.
DEVOTIONAL