ఇలా ఒక్క‌సారి చేస్తే చాలు..బ్లాక్ హెడ్స్ స‌మ‌స్యే ఉండ‌దు!

బ్లాక్ హెడ్స్.స్త్రీల‌నే కాదు పురుషుల‌నూ ఇబ్బంది పెట్టే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

 Best Home Remedies To Get Rid Of Blackheads! Home Remedies, Blackheads, Latest N-TeluguStop.com

అందులోనూ జిడ్డు చ‌ర్మ త‌త్వం క‌ల‌వారు మ‌రింత ఎక్కువ‌గా బ్లాక్ హెడ్స్‌తో తిప్ప‌లు ప‌డుతూ ఉంటారు.ఈ నేప‌థ్యంలోనే వాటిని తొల‌గించుకునేందుకు ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ను పాటిస్తే గ‌నుక చాలా అంటే చాలా సుల‌భంగా బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య‌ను వ‌దిలించుకోవ‌చ్చు.మ‌రి లేట్ చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో ఓ చూసేయండి.

స్టెప్‌-1:

ముందుగా ఒక గిన్నెలో గ్లాస్ వాట‌ర్‌, గుప్పెడు వేపాకు, గుప్పెడు తుల‌సి ఆకులు వేసి బాగా మ‌రిగించాలి.ఇప్పుడు ముఖానికి కొద్దిగా వెన్న అప్లై చేసుకుని.

ఆ త‌ర్వాత హీట్ చేసిన వాట‌ర్‌తో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆవిరి ప‌ట్టుకోవాలి.

Telugu Tips, Blackheads, Skin, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health -

స్టెప్‌-2:

ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ షుగ‌ర్ పౌడ‌ర్ మ‌రియు రెండు స్పూన్ల తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి ముఖం మొత్తానికి అప్లై చేసి కాస్త డ్రై అవ్వ‌నివ్వాలి.అప్పుడు వేళ్ల‌తో స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో శుభ్ర ప‌రుచుకోవాలి.

స్టెప్‌-3:

చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్‌ గోధుమ పిండి, ఒక స్పూన్ బాదం పౌడ‌ర్‌, అర స్పూన్ అలోవెర జెల్ మ‌రియు స‌రిప‌డా ప‌చ్చి పాలు వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావు గంట అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

వారంలో ఒకే ఒక్క సారి ఈ మూడు స్టెప్స్‌నూ ప‌ట్టిస్తే.బ్లాక్ హెడ్స్ మాత్ర‌మే కాదు వైట్ హెడ్స్ కూడా పోయి ముఖ చ‌ర్మం అందంగా, కాంతి వంతంగా మారుతుంది.

మ‌రియు స్కిన్ టోన్ సైతం మెరుగు ప‌డుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube