తెలంగాణలో రాజకీయాలు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున జరుగుతున్న విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే బీజేపీ స్వతహాగా టీఆర్ఎస్ పై పోరాడేంత శక్తి బీజేపీకి లేదు.అందుకు ప్రధాన కారణం బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలమైన కార్యవర్గం లేకపోవడం.
అందుకు బీజేపీ ఎంచుకున్న వ్యూహం సోషల్ మీడియా.దీంతో సోషల్ మీడియా ను ఆసరాగా చేసుకొని ప్రభుత్వాన్ని, నాయకులను పెద్ద ఎత్తున అవమానపరుస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
అంతేకాక తమను అవమాన పరిచే విధంగా పోస్టులు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని సీఐడీ అధికారులను కోరడం జరిగింది.అయితే టీఆర్ఎస్ వేసిన ఈ అడుగు పట్ల బీజేపీ నుండి ఎటువంటి స్పందన లేదు.

ఒకవేళ పోలీసులు నోటీసులు ఇచ్చాక బీజేపీ స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల వార్, ఫిర్యాదుల వార్ కూడా నడుస్తోంది.అయితే ప్రస్తుతం చాలా వరకు బీజేపీ రెండో ప్రత్యామ్నాయంగా మారినా టీఆర్ఎస్ కు భారీ లాభం చేకూర్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.ఎందుకంటే బీజేపీ తరహా రాజకీయ విధానం తెలంగాణలో విస్తరించడానికి కెసీఆర్ అవకాశం ఇవ్వకపోవచ్చు.
ఎందుకంటే బీజేపీది మత రాజకీయం.తెలంగాణలో ఇప్పటివరకు మతం, కులం ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు జరగలేదు కాబట్టి ఆ సంస్కృతిని దెబ్బ తీసే ప్రయత్నాలకు పెద్దగా అవకాశం ఉండకపోవచ్చని చాలా మంది వెల్లడిస్తున్న అభిప్రాయం ఇది.ఏది ఏమైనా టీఆర్ఎస్ యాక్షన్ కి బీజేపీ నుండి రియాక్షన్ వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.