ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ అభివృద్ధి చెందడంతో ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఎన్నో వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో హర్రర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగిటివ్ పాత్రలో సందడి చేయనున్నారు.
ఈ విషయాన్ని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.అయితే ఇప్పటి వరకు ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయంగురించి ఆలోచిస్తూ ఉండగా తాజాగా నాగ చైతన్య సరసన నటించడానికి తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
అయితే ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఇంకా ఈ చిత్రం పూర్తి కాకుండానే ఇలా వీరి కాంబినేషన్ వెబ్ సిరీస్ ప్రకటించారు.