ఇలా ఒక్కసారి చేస్తే చాలు..బ్లాక్ హెడ్స్ సమస్యే ఉండదు!
TeluguStop.com
బ్లాక్ హెడ్స్.స్త్రీలనే కాదు పురుషులనూ ఇబ్బంది పెట్టే చర్మ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.
అందులోనూ జిడ్డు చర్మ తత్వం కలవారు మరింత ఎక్కువగా బ్లాక్ హెడ్స్‌తో తిప్పలు పడుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే వాటిని తొలగించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ను పాటిస్తే గనుక చాలా అంటే చాలా సులభంగా బ్లాక్ హెడ్స్ సమస్యను వదిలించుకోవచ్చు.
మరి లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో ఓ చూసేయండి.h3 Class=subheader-styleస్టెప్-1:/h3p ముందుగా ఒక గిన్నెలో గ్లాస్ వాటర్, గుప్పెడు వేపాకు, గుప్పెడు తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి.
ఇప్పుడు ముఖానికి కొద్దిగా వెన్న అప్లై చేసుకుని.ఆ తర్వాత హీట్ చేసిన వాటర్‌తో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆవిరి పట్టుకోవాలి.
"""/"/
H3 Class=subheader-styleస్టెప్-2:/h3p ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ షుగర్ పౌడర్ మరియు రెండు స్పూన్ల తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి ముఖం మొత్తానికి అప్లై చేసి కాస్త డ్రై అవ్వనివ్వాలి.
అప్పుడు వేళ్లతో స్మూత్‌గా స్క్రబ్ చేసుకుంటూ గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి.
H3 Class=subheader-styleస్టెప్-3: /h3pచిన్న గిన్నె తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి, ఒక స్పూన్ బాదం పౌడర్, అర స్పూన్ అలోవెర జెల్ మరియు సరిపడా పచ్చి పాలు వేసుకుని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావు గంట అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
వారంలో ఒకే ఒక్క సారి ఈ మూడు స్టెప్స్‌నూ పట్టిస్తే.బ్లాక్ హెడ్స్ మాత్రమే కాదు వైట్ హెడ్స్ కూడా పోయి ముఖ చర్మం అందంగా, కాంతి వంతంగా మారుతుంది.
మరియు స్కిన్ టోన్ సైతం మెరుగు పడుతుంది.
మార్చి నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. 29 సినిమాలు విడుదలైతే ఎన్ని హిట్ అయ్యాయంటే?