టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సిద్ధు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) డీజే టిల్లూ, టిల్లూ స్క్వేర్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.
త్వరలో సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమాతో( Jack Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
బొమ్మరిల్లు భాస్కర్ తో మాట్లాడిన సమయంలో ఆరెంజ్ రోజులను గుర్తు చేసుకున్నామని సిద్ధు జొన్నలగడ్డ పేర్కొన్నారు.ప్రతి హీరో కెరీర్ లో ఒక స్పెషల్ రోల్ ఉంటుందని నా కెరీర్ లో అలాంటి రోల్ టిల్లు అని సిద్ధు జొన్నలగడ్డ వెల్లడించారు.
రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానని చరణ్ తో యాక్ట్ చేయడం నాకు ఎంతో ఇష్టం అని సిద్ధు జొన్నలగడ్డ పేర్కొన్నారు.

డైరెక్టర్ ప్రతిభను చూసి నేను ఛాన్స్ ఇస్తానని సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.బొమ్మరిల్లు భాస్కర్( Bommarillu Bhaskar ) కొత్త కాన్సెప్ట్ తోనే సినిమాలు చేస్తారని ఆ నమ్మకంతోనే చేశానని సిద్ధు జొన్నలగడ్డ వెల్లడించారు.బేబీ సినిమాలో వైష్ణవి రోల్ కు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉందో జాక్ సినిమాలో నా పాత్ర అలానే ఉంటుందని సిద్ధు జొన్నలగడ్డ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ లాంటి స్టైల్ తన సినిమాలలో కనిపిస్తుందనే ప్రశ్నకు సిద్ధు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ తో పోల్చడమే నాకు ప్రశంసతో సమానం అని చెప్పుకొచ్చారు.సినిమాల్లో హీరో పాత్రకు ఒక స్టైల్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అని పవన్ లా కనిపించడం నేను ప్లాన్ చేసుకున్నది కాదని సిద్ధు తెలిపారు.ఈ సినిమాలో నాకు తెలిసినట్లు నటించానని అలా గుర్తింపు వచ్చిందంతే అని సిద్ధు పేర్కొన్నారు.