బాదం నూనెతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు!

బాదం నూనె.( Almond Oil ) బాదం పప్పు నుండి తయారు చేయబడుతుంది.

 Wonderful Benefits Of Almond Oil Details! Almond Oil, Almond Oil Benefits, Almon-TeluguStop.com

బాదం నూనె కాస్త ఖరీదు ఎక్కువే అయినప్పటికీ.విటమిన్ డి, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ ఇలా దానిలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

బాదం నూనె ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అనేక జబ్బులను అడ్డుకుంటుంది.

అలాగే చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా బాదం నూనె ఉపయోగపడుతుంది.అసలు దీని ప్రయోజనాలు తెలుసుకుంటే ఖ‌చ్చితంగా ఆశ్చర్యపోతారు.

చాలా మంది బాదం నూనెను సలాడ్స్ లో కలిపి తీసుకుంటారు.కొందరు పాలతో కలిపి ఆల్మండ్ ఆయిల్ ను తీసుకుంటారు.ఆరోగ్యపరంగా బాదం నూనె గుండెకు( Heart ) ఎంతో మేలు చేస్తుంది.కంటి చూపును( Eye Sight ) పెంచుతుంది.

మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.

బరువు తగ్గడానికి కూడా బాదం నూనె సహాయపడుతుంది.

Telugu Almond Oil, Almondoil, Tips, Lifestyle, Skin Care-Telugu Health

అలాగే ప్ర‌స‌వం అనంత‌రం మ‌హిళ‌లు స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతుంటారు.అలాంటి వారు రోజు నైట్ నిద్రించే ముందు బాదం నూనెను స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయి.

స్నానం చేయడానికి గంట ముందు ముఖానికి, చేతులకు, మెడకు, కాళ్లకు బాదం నూనె అప్లై చేసుకుంటే చర్మం స్మూత్ అండ్ షైనీగా మెరుస్తుంది.ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.

Telugu Almond Oil, Almondoil, Tips, Lifestyle, Skin Care-Telugu Health

డ్రై లిప్స్ తో బాధపడేవారు నైట్ నిద్రించే ముందు రోజు పెదాలకు బాదం నూనె అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే పెదాలు మృదువుగా కోమలంగా మారుతాయి.పాదాల పగుళ్లను నివారించడానికి కూడా బాదం నూనె ఎంతో బాగా సహాయపడుతుంది.పాదాలకు నేరుగా బాదం నూనె అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే పాదాల పగుళ్లు కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube