బాదం నూనెతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు!

బాదం నూనె.( Almond Oil ) బాదం పప్పు నుండి తయారు చేయబడుతుంది.

బాదం నూనె కాస్త ఖరీదు ఎక్కువే అయినప్పటికీ.విటమిన్ డి, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ ఇలా దానిలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

బాదం నూనె ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అనేక జబ్బులను అడ్డుకుంటుంది.

అలాగే చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా బాదం నూనె ఉపయోగపడుతుంది.అసలు దీని ప్రయోజనాలు తెలుసుకుంటే ఖ‌చ్చితంగా ఆశ్చర్యపోతారు.

చాలా మంది బాదం నూనెను సలాడ్స్ లో కలిపి తీసుకుంటారు.కొందరు పాలతో కలిపి ఆల్మండ్ ఆయిల్ ను తీసుకుంటారు.

ఆరోగ్యపరంగా బాదం నూనె గుండెకు( Heart ) ఎంతో మేలు చేస్తుంది.కంటి చూపును( Eye Sight ) పెంచుతుంది.

మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.

బరువు తగ్గడానికి కూడా బాదం నూనె సహాయపడుతుంది. """/" / అలాగే ప్ర‌స‌వం అనంత‌రం మ‌హిళ‌లు స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతుంటారు.

అలాంటి వారు రోజు నైట్ నిద్రించే ముందు బాదం నూనెను స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.

ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయి.స్నానం చేయడానికి గంట ముందు ముఖానికి, చేతులకు, మెడకు, కాళ్లకు బాదం నూనె అప్లై చేసుకుంటే చర్మం స్మూత్ అండ్ షైనీగా మెరుస్తుంది.

ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి. """/" / డ్రై లిప్స్ తో బాధపడేవారు నైట్ నిద్రించే ముందు రోజు పెదాలకు బాదం నూనె అప్లై చేసుకోవాలి.

ఇలా చేస్తే పెదాలు మృదువుగా కోమలంగా మారుతాయి.పాదాల పగుళ్లను నివారించడానికి కూడా బాదం నూనె ఎంతో బాగా సహాయపడుతుంది.

పాదాలకు నేరుగా బాదం నూనె అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే పాదాల పగుళ్లు కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.

గేమ్ ఛేంజర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా.. అందుకే రిజెక్ట్ చేశారా?