ఒక కేఫ్‌లోని కేఫ్‌లోని క్యాషియర్‌పై( Cafe Cashier ) జాత్యహంకార వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆమెపై దాడి చేసిన ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్ కోర్ట్( Singapore Court ) నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 4000 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.నిందితుడిని రిషి డేవిడ్ రమేష్ నంద్వానీ (27)గా( Rishi David Ramesh Nandwani ) గుర్తించారు.
ఇతను సోమవారం హాలండ్ గ్రామంలోని ఓ షాపింగ్ కాన్‌క్లేవ్‌లో దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
శిక్ష విధించేటప్పుడు రెండు అభియోగాలను పరిగణనలోనికి తీసుకుంది న్యాయస్థానం.
ఛానెల్ న్యూస్ ఏషియా నివేదిక ప్రకారం రిషి రిమాండ్ స్థలం నుంచే వీడియో లింక్ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యాడు.అక్టోబర్ 31న ఈ ఘటన జరిగినప్పుడు కేఫ్ రద్దీగా ఉండటంతో పాటు చిన్నారులు ఉన్నారు.మధ్యాహ్నం 12.20 గంటలకు నిందితుడు రిషి తన ఫుడ్ ఆర్డర్( Food Order ) చేయడానికి క్యూలో నిలబడుతున్నట్లు భావించి కౌంటర్ ముందు నిలబడ్డాడని పోలీసులు తెలిపారు.
నిజానికి అతను క్యూలో తప్పుగా నిలబడటం గమనించిన మహిళా క్యాషియర్ అతనికి విషయం తెలియజేసి వెనక్కి వెళ్లమని చెప్పిందని పోలీసులు వెల్లడించారు.ఆ మాటలతో మనస్తాపం చెందిన రిషి ఆమెను అసభ్యపదజాలంతో దూషించాడు.ఇందులో చైనీస్ ప్రజలను ఉద్దేశించి జాతి విద్వేష వ్యాఖ్యలు( Racist Comments ) కూడా ఉన్నాయని తేలింది.అంతేకాదు.తాను క్యూలో వెనక్కి వెళ్లేది లేదని తేల్చిచెప్పాడు.ఆ మాటలతో బాధపడ్డ బాధితురాలు అతనికి దూరంగా వెళ్లి తన పై అధికారితో మాట్లాడింది.
ఏమాత్రం శాంతించని రిషి.కౌంటర్‌లో ఉన్న టిప్ బాక్స్ తీసుకుని ఆమెపైకి విసిరాడు.
చివరికి కేఫ్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా క్యాషియర్‌కు అసభ్యకరమైన సైగలు, దూషణలు చేస్తూనే ఉన్నాడు.అతని తీరుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రిషిని అదుపులోకి తీసుకున్నారు.విచారణ సందర్భంగా రిషి బూతులు, దాడికి సంబంధించిన వీడియోలను కోర్టులో ప్లే చేశారు.