సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్( Viral Video ) అవుతూ ఉంటాయి.అందులో ఎక్కువగా జంతువులకు సంబందించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే.
ఎందుకంటే ఇటువంటి వీడియోలు ఎక్కువగా జనరంజకంగా ఉంటాయి కాబట్టి.ఎందుకంటే? మనకి దూరంగా పెరుగుతున్న జీవరాసులు మనం ఎక్కువగా వీడియోలలోనే చూసుకుంటాం కాబట్టి.అందులోనూ రెండు విభిన్న జాతులకు చెందిన జీవులు కొట్లాట అడ్డుకుంటే ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా విజాతులైన కోబ్రా,( Cobra ) ముంగీసకు( Mongoose ) సంబంధించిన వీడియోలు చూసినపుడు, వాటి మధ్య గొడవ చెలరేగినపుడు.చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ!
ప్రస్తుతం ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనాలు ఆ వీడియోని తెగ చూస్తున్నారంటే మీరు నమ్మి తీరాల్సిందే.సాధారణంగా ఈ రకమైన 2 జాతులు ఎదురుపడితే భీకర ఫైట్ మొదలవడం సర్వసాధారణమైన విషయం.ఈ క్రమంలో కొన్నిసార్లు కోబ్రా గెలిస్తే.
మరికొన్నిసార్లు ముంగీస గెలుస్తుంటుంది.ఎక్కువ సార్లు మాత్రం ముంగీస పైచేయి సాధిస్తుంటుందని అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా, వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే… నీటిలో ఆహారం కోసం వెతుకుతున్న కోబ్రాకు ముంగీస ఎదురుపడుతుంది.పామును చూడగానే ముంగీస దాడికి సై అంటుంది.
ఈ క్రమంలో పాము కూడా పడగ విప్పి దాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.అయితే ముంగీస ఏమాత్రం భయపడకుండా దానిపై దాడి చేస్తుంది.
ఈ క్రమంలో ముంగీస దాడి నుంచి తప్పించుకున్న పాము.తిరిగి దాన్ని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది.
అదే సమయంలో ముంగీస ఎంతో తెలివిగా దాని దాడి నుంచి తప్పించుకుని మరీ దెబ్బతీస్తుంది.ఇలా అనేక సార్లు ముంగీస దాడి చేయడంతో చివరకు పాము భయంతో హడలిపోయి పారిపోతుంది.అయినా ముంగీస పామును విడిచిపెట్టకుండా పదే పదే దాడి చేసేందుకు యత్నిస్తూ ఉంటుంది.ఈ వీడియో ఇంతటితో ముగియగా దీనిని అనేకమంది తిలకిస్తున్నారు.అయితే మొత్తానికి ఈ ఫైట్‌లో ముంగీస గెలిచినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది.కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.“ఫైట్ మామూలుగా లేదుగా” అని కొందరు కామెంట్ చేస్తే… “ముంగీస పాముకు చుక్కలు చూపించిందిగా!” అంటూ కొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో 15 వేలకు పైగా లైక్‌లు, 2.57 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.