కన్నడంలో ప్రసంగం .. కెనడా ప్రధాని రేసులో దూకిన భారత సంతతి ఎంపీ

జస్టిన్ ట్రూడో ( Justin Trudeau )రాజీనామాతో కెనడాలో ప్రధాని పదవికి ఎన్నికల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే.ఇందులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.

 Indian-origin Mp Chandra Arya Addresses Canadian House In Kannada , Kannada , Mp-TeluguStop.com

భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య( MP Chandra Arya ) కూడా ప్రధాని పదవి రేసులో నిలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ మేరకు నామినేషన్ దాఖలు చేసిన ఆయన కెనడా పార్లమెంట్‌లో తన మాతృభాష కన్నడంలో ప్రసంగించి అందరి దృష్టినీ ఆకర్షించారు.

తరతరాలుగా చూడని నిర్మాణాత్మక సమస్యలను మనం ఎదుర్కొంటున్నామని.వాటిని పరిష్కరించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్ర చెప్పారు.కెనడియన్లకు( Canadians ) ఏది ఉత్తమమో దాని కోసం తాను శ్రమిస్తానని.నా పిల్లల కోసం సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.

లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని చంద్ర ఆర్య హామీ ఇచ్చారు.ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telugu Anita Anand, Canadians, Dharwad, Indianorigin, Justin Trudeau, Kannada, M

కర్ణాటకలోని సిరలో జన్మించిన ఆయన ధార్వాడ్‌లోని కౌశాలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో( Kausali Institute of Management Studies, Dharwad ) ఎంబీఏ పూర్తి చేశారు.2006లో ఆయన కెనడాకు వలస వెళ్లారు.తొలుత ఇండో కెనడా ఒట్టావా బిజినెస్ ఛాంబర్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన చంద్ర ఆర్య అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.2015 కెనడా ఫెడరల్ ఎన్నికల్లో నెపియన్ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.తొలి నుంచి కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా బలమైన స్వరం వినిపిస్తున్నారు చంద్ర ఆర్య.ఈ క్రమంలో ఆయన పలుమార్లు ఖలిస్తాన్ మద్ధతుదారులకు టార్గెట్ అయ్యారు కూడా.

ఇప్పటికే భారత సంతతికి చెందిన అనితా ఆనంద్( Anita Anand ) కూడా కెనడా ప్రధాని రేసులో ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు చంద్ర ఆర్య కూడా పోటీలో నిలవడంతో ఉత్కంఠ నెలకొంది.

Telugu Anita Anand, Canadians, Dharwad, Indianorigin, Justin Trudeau, Kannada, M

కాగా.కెనడా ప్రధాని ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్లు భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.అంతేకాదు తాను పార్లమెంట్‌కు తిరిగి ఎన్నిక కావాలనే ఉద్దేశం లేదని తెలిపారు.తాను తిరిగి బోధనా వృత్తి వైపు వెళ్తానని అనిత స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube