ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( United Arab Emirates ) (యూఏఈ) కూడా ఒకటి.ఇక్కడి భారత రాయబార కార్యాలయం .
యూఏఈలోని ఎన్ఆర్ఐలకు అందించే సేవల గురించి కీలక ప్రకటన చేసింది.పాస్‌పోర్ట్ రెన్యూవల్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కావాల్సిన విషయాలను కూడా ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
రెగ్యులర్ పాస్‌పోర్ట్ రెన్యూవల్ సర్వీస్, తత్కాల్ పాస్‌పోర్ట్ సర్వీస్, ప్రీమియం లాంజ్ సేవలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
ప్రతి విభాగంలోనూ ప్రాసెసింగ్ సమయాన్ని ఇండియన్ ఎంబసీ ( Indian Embassy )తెలియజేసింది.అయితే పాస్‌పోర్ట్‌ల ఫాస్ట్ ట్రాక్ రెన్యూవల్‌ను తత్కాల్ సర్వీస్ ద్వారా మాత్రమే చేయడం కుదురుతుంది.
ఇందుకోసం దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం, భారత కాన్సులేట్‌లు అదనపు రుసుము వసూలు చేస్తాయని పేర్కొంది.
యూఏఈలోని భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తులను బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ కేంద్రాల ద్వారా సేకరిస్తారు.
వీటిని భారత ప్రభుత్వంలోని పలు విభాగాల సహాకారంతో భారతీయ మిషన్లు ప్రాసెస్ చేస్తాయి.దరఖాస్తును సమర్పించడానికి యూఏఈలోని భారతీయ ప్రవాసులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వివిధ భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్ల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీఎల్ఎస్ కేంద్రాలు, దుబాయ్, అబుదాబీలలో( BLS Centres, Dubai and Abu Dhabi ) ఉన్న బీఎల్ఎస్ ప్రీమియం లాంజ్‌లలో ఏదో ఒకదానితో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.

అయితే తత్కాల్ పాస్‌పోర్ట్ రెన్యూవల్ సర్వీస్ కావాల్సిన వారికి ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.తత్కాల్ దరఖాస్తుదారులందరికీ వాక్ ఇన్‌లు అంగీకరించబడతాయని మిషన్ పేర్కొంది.పాస్‌పోర్ట్ పునరుద్ధరణ సేవలకు భారత్‌లోని పోలీస్ క్లియరెన్స్ అవసరం.దరఖాస్తు సమయంలో ఎంచుకున్న సర్వీస్ కేటగిరీని బట్టి ఇది వివిధ దశలలో జరుగుతుందని రాయబార కార్యాలయం వెల్లడించింది.

సాధారణ పాస్‌పోర్ట్ రెన్యూవల్ సర్వీస్‌కు మూడు నుంచి నాలుగు రోజులు.తత్కాల్ పాస్‌పోర్టులైతే మరుసటి రోజు లేదా దరఖాస్తున్న చేసుకున్నప్పటి నుంచి 12 గంటల వ్యవధిలో జారీ చేయబడతాయి.అదే ప్రీమియం లాంజ్ సర్వీస్ ద్వారా సమర్పించబడిన పాస్‌పోర్ట్‌లు సాధారణ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయని మిషన్ పేర్కొంది.







