మచ్చలు లేకుండా ముఖ చర్మం అందంగా మరియు ఆకర్షణీయంగా మెరిసిపోవాలని దాదాపు అందరూ కోరుకుంటారు.కానీ ఎక్కువ శాతం మందికి ఆ కోరిక కోరికగానే మిగిలిపోతుంటుంది.
ఏదో ఒక కారణం చేత ముఖంపై మచ్చలు పడి చర్మ సౌందర్యం దెబ్బ తింటుంది.ఈ క్రమంలోనే ఆ మచ్చలను ఎలా వదిలించుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.
అయితే ఇకపై అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ త్రిఫల పౌడర్( Triphala powder ) ను వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ ను వేసుకుని కలుపుకోవాలి.
చివరిగా రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకుని నిద్రించాలి.మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే కేవలం కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.
మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. పిగ్మెంటేషన్ సమస్య( Pigmentation problem ) నుంచి విముక్తి పొందడానికి కూడా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి ఎవరైతే మచ్చలతో మదన పడుతున్నారో తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.
పైగా ఈ రెమెడీని రెగ్యులర్ యూస్ చేయడం వల్ల ముడతలు త్వరగా పడకుండా ఉంటాయి.చర్మం బిగుతుగా మరియు ప్రకాశవంతంగా కూడా మారుతుంది.