దక్షా నగార్కర్ ( Daksha Nagarkar )హోరాహోరి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి దక్షా తాజాగా రవితేజ( Raviteja ) హీరోగా నటిస్తున్న రావణాసుర ( Ravanasura )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి దక్షా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోని తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈమె నాగచైతన్య నాగార్జున హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా సమయంలో ఈమె నాగచైతన్యకు కళ్ళతో సైగలు చేసి ఒక్కసారిగా సంచలనంగా మారారు.అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో నాగచైతన్యకు దక్షా మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకు వచ్చాయి.
తాజాగా దక్షా నాగార్కర్ మరోసారి నాగచైతన్య గురించి మాట్లాడుతూ నాగచైతన్య చాలా సింపుల్ గా ఉంటారు.ఆయనకు అమ్మాయిలను గౌరవించడం తెలుసు, అలాగే వారి పట్ల చాలా కేర్ తీసుకుంటారు.బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో ఆయన తనని హగ్ చేసుకోవడానికి, తనకు ముద్దు పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారని అయితే ఈ సన్నివేశాలు పూర్తి అయిన తర్వాత వెంటనే వచ్చి తనకు సారీ చెప్పేవారని ఈమె తెలియజేశారు.చైతూ లాంటి అబ్బాయిని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుందంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.