శ్రీరామునికి పరమ భక్తుడు హనుమంతుడు.ముఖ్యంగా చెప్పాలంటే రాములవారిని తన గుండెల్లో బంధించుకున్న అపార భక్తుడు హనుమంతుడు.
శ్రీరాముడికి హనుమంతుడు చేసిన సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువే అని కచ్చితంగా చెప్పవచ్చు.సనాతన ధర్మంలో మంగళవారం సంకట మోచనుడు హనుమంతుడికి అంకితం చేయబడి ఉంది.
అయితే శనివారం హనుమంతుడు పుట్టినరోజు కాబట్టి కొంత మంది హనుమంతుడి భక్తులు మంగళ, శనివారాల్లో కూడా పూజలు చేసి ఉపవాసం పటిస్తారు.అయితే ఎవరికైనా జాతకంలో కుజదోషం ఉంటే మంగళవారం హనుమంతుడిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
ఇప్పుడు మంగళవారం రోజు కుజ దోష నివారణ కోసం హనుమంతుడిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జాతకంలో కుజదోషం( Kuja Dosha ) ఉంటే ప్రతి మంగళవారం హనుమంతుని పూజించాలి.
ఇలా ప్రతి మంగళవారం హనుమంతుని పూజిస్తే కుజుడు శుభాలను కలుగజేస్తాడు.మంగళవారం రోజున హనుమాన్ స్తోత్ర పారాయణం మొదలుపెట్టండి.
ఈ స్తోత్రాన్ని 21సార్లు పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.అయితే ఎవరికైనా 21 సార్లు హనుమాన్ స్తోత్రాన్ని చదివేందుకు సమయం కుదరని పక్షంలో మనస్పూర్తిగా హనుమంతుడిని పూజించి ఒక్కసారి మనస్పూర్తిగా ఈ స్తోత్రాన్ని చదవడం మంచిది.
హనుమంత స్తోత్రాలను పఠించడం వల్ల శత్రుభాధలు కూడా తొలగిపోతాయి.
ఇంకా చెప్పాలంటే వరుసగా 21 మంగళవారాలు హనుమాన్ ఆలయంలో బెల్లాన్ని( Jaggery ) నైవేద్యంగా సమర్పించడం వల్ల జీవితంలో సుఖం, ఆనందం, శాంతి లభిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా శరీర యొక్క రుగ్మతలతో బాధపడుతున్నట్లయితే ఆ వ్యక్తి మంగళవారం రోజు హనుమంతుని చిత్రం ముందు ఒక పాత్రలో నీటిని నింపి ఉంచాలి.అంతేకాకుండా హనుమాన్ చాలీసా( Hanuman Chalisa ) 21 రోజులు పఠించాలి.
ఆ తర్వాత నీటిని మార్చాలి.ఇలా 21వ వారాలు చేయడం వల్ల అనారోగ్యం నుంచి ముక్తి లభిస్తుంది.
ముఖ్యంగా ఎవరైనా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లయితే ఏదో ఒక మంగళవారం రోజు నుంచి ఓం హనుమంతే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శుభ ఫలితం లభిస్తుంది.
DEVOTIONAL