పెళ్లి వేడుకలలో క్రేజీ స్టెప్స్‌తో ఉర్రూతలూగించిన వృద్ధ జంట.. వీడియో వైరల్..

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఇప్పటికే ఎంతో మంది వృద్ధులు నిరూపించారు.మంచం పట్టాల్సిన వయసులో వారు సాహసాలు చేసి యువతకే సవాల్ విసిరారు.

 Sikh Couple Dance On Senorita Song Video Viral On Social Media Details, Viral Vi-TeluguStop.com

కొందరు మైకేల్ జాక్సన్ లాగా స్టెప్పులు వేస్తూ తమలోని సత్తా ఇంకా పోలేదని చెప్పకనే చెప్పారు.అయితే సరిగ్గా ఇలాంటి ఎనర్జీ, ఉత్సాహమే గల ఒక వృద్ధ జంట( Old Couple ) ఒక పెళ్లి వేడుకలో క్రేజీ స్టెప్స్ వేసి దుమ్మురేపారు.నిజానికి వీరు డ్యాన్స్( Dance ) వేయడం కొత్తేం కాదు.5 ఏళ్ల క్రింద ఈ ముసలి దంపతులు ఒక పార్టీలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఇంటర్నెట్ ను ఊపేశారు.మళ్లీ ఇప్పుడు వీరు తమ డ్యాన్స్ తో నెటిజన్లను ఉర్రూతలూగిస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా ఇందులో ఒక వెడ్డింగ్ సెలబ్రేషన్స్( Wedding Celebrations ) జరుగుతుండటం చూడవచ్చు.

Telugu Dance, Latest, Senorita, Sikh, Sikh Dance-Latest News - Telugu

ఈ వేడుకలలో “జిందగి న మిలేగి దొబర మూవీ” నుంచి “సెనోరిటా” పాట ప్లే చేయగా దానికి ఈ వృద్ధ దంపతులు చాలా స్టైలిష్‌గా డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ ఇచ్చారు.వీరు చాలా గ్రేట్ ఫుల్ గా డాన్స్ చేస్తుంటే, పెళ్లికి విచ్చేసిన అతిథులు అందరూ చప్పట్లు కొడుతూ హోరెత్తించారు.సిక్కు కపుల్ అయిన వీరు సంప్రదాయంగానే డ్రెస్ చేసుకున్నారు కానీ చాలా స్టైలిష్ గా కనిపించారు.పెద్దాయన బ్లేజర్‌, ప్యాంట్స్ ధరించి హీరో లాగా కనిపించగా.అతని సతీమణి సల్వార్ సూట్‌లో మెరిసిపోయింది.ఆమె డ్యాన్స్ వేస్తున్నంత సేపు తన ముఖంపై చిరునవ్వును మెయింటైన్ చేసింది.

అదే అందరి హృదయాలను దోచేసింది.

Telugu Dance, Latest, Senorita, Sikh, Sikh Dance-Latest News - Telugu

అంతేకాదు, వారిద్దరూ చాలా కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తూ ఆకట్టుకునే రీతిలో స్టెప్పులు వేశారు.సిఖ్‌లెన్స్ (Sikhlens) ఫేస్‌బుక్ అకౌంట్ తాజాగా ఈ వీడియోను పంచుకుంది.ఈ వీడియో చూసిన ఇంటర్నెట్ యూజర్లు మ్యూజిక్ ప్రతి ఒక్కరిని ఒకటి చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు.

ఈ దంపతులకు స్టాండింగ్ వొవేషన్‌ ఇచ్చినా తక్కువే అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.ఈ కపుల్ గ్రేస్‌, రిథమ్ అద్భుతంగా ఉన్నాయని మరి కొందరు వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube