పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున నిర్వహించారు.ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సందర్భంగా, ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను నిర్వహించారు.ఈ ఈవెంట్ కు ప్రభాస్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఈవెంట్ జాతీయస్థాయిలో అందరూ అబ్బుర పడేలా భారీగా ఏర్పాట్లు చేశారు.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ ఈవెంట్ లో నవీన్ పొలిశెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తూ దుమ్ము దులిపేశాడు.నవీన్ మొదట ఎంట్రీ ఇవ్వడమే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత స్టేజి పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని తన పంచులతో ఆడేసుకున్నారు.ప్రభాస్ తో అన్ని భాషల్లో అభిమానులకు హాయ్ చెప్పించాడు.
ఇక పామిస్ట్ అంటూ అందరిదీ సరదాగా నవ్వించాడు.డార్లింగ్ ప్రభాస్ చేత జాతకం చూపించుకున్నాడు.

బుట్ట బొమ్మ పూజా హెగ్డేతో నేడు డ్యాన్స్ చేసే ఛాన్స్ వస్తుందా అని నవీన్ ప్రభాస్ తో చెప్పించుకున్నాడు.అనంతరం యూవీ మామ అంటూ యు.వి.క్రియేషన్స్ మీద వచ్చిన ట్రోలింగ్ మీమ్స్ ను మళ్లీ గుర్తు చేశాడు.రాధేశ్యామ్ సినిమా విషయంలో, అప్డేట్ ఇవ్వడంతో యు.వి.క్రియేషన్స్ వహించిన అలసత్వాన్ని నవీన్ పొలిశెట్టి గుర్తుచేశాడు.యు.
వి.క్రియేషన్స్ వంశీ ప్రమోద్ ఎక్కడ ఉన్నారు.

మీరు స్టేజి మీదకు రారు కాబట్టి నేను వస్తాను.మీరు ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ పెడతారు.కాని అప్డేట్లు ఇవ్వరు ఎందుకు అని అడిగేశాడు.యూవి ఆఫీసులో ఏమైన నెట్ ప్రాబ్లమా అని నవీన్ పంచ్ వేశాడు.అవును నెట్ ప్రాబ్లం అని యు.వి క్రియేషన్స్ ప్రమోద్ చెప్పుకొచ్చాడు.ఇక వెంటనే నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ నుంచి రూటర్ పంపిస్తాను అంటూ కౌంటర్ వేయగా అందుకు ప్రభాస్ పగలబడి నవ్వేశాడు.