మనలో ఎంతో మంది బాన పొట్టతో బాధపడుతుంటారు.జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంటుంది.
పొట్ట కొవ్వును నిర్లక్ష్యం చేస్తే మధుమేహం నుంచి గుండె జబ్బుకు వరకు ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.అందుకే పొట్ట కొవ్వును కరిగించుకోవడం ఎంతో అవసరం.
అయితే అందుకు నెయ్యి బాగా సహాయపడుతుంది.
నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తుంటారు.
కానీ అది అపోహ మాత్రమే.మితంగా నెయ్యిని తీసుకుంటే వెయిట్ గెయిన్ కాదు లాస్ అవుతారు.
అలాగే పొట్ట కొవ్వును కట్ చేసే సామర్థ్యం కూడా నెయ్యికి ఉంది.మరి ఇంతకీ నెయ్యిని ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి లేదా మెంతులు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

బాగా మరిగిన అనంతరం వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కలిపి సేవించాలి.ఈ విధంగా ప్రతి రోజూ కనుక చేస్తే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది.కొద్ది రోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. స్కిన్ హెల్తీ గా మారుతుంది.హైడ్రేటెడ్‌గా, గ్లోయింగ్ గా మెరుస్తుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
హెయిర్ ఫాల్ దూరం అవుతుంది.మరియు రక్తంలో చక్కెర స్థాయిలు సైతం నియంత్రణలో ఉంటాయి.
అందువల్ల మధుమేహం ఉన్న వారు కూడా ఈ డ్రింక్ ను తీసుకోవచ్చు.