అందాన్ని పెంచుకోవడం కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసమే..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది మహిళలు అందంగా కనబడాలని ఎన్నో రకాల మేకప్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు.దీని వల్ల అందంగా కనిపించిన తర్వాత చర్మ సమస్యల వారిన పడుతూ ఉంటారు.

 Increase Your Beauty With These Natural Face Packs At Home Details,  Natural Fac-TeluguStop.com

అయితే చర్మ సంరక్షణతో పాటు అందం గా కనిపించాలి అంటే ఇంట్లోనే సహజమైన ఫేస్ ప్యాక్( Natural Face Pack ) తయారు చేసుకోవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు.వీటిని తయారు చేయడానికి ఇంట్లో లభించే పదార్థాలు ఉంటే సరిపోతుంది.

ఈ ఫేస్ ప్యాక్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే పసుపు, శనగపిండి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

దీని కోసం మీరు ముందుగా శెనగపిండి, పసుపును తీసుకోవాల్సి ఉంటుంది.ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి( Besan Flour ) తీసుకుని ఇందులోకి అర టేబుల్ స్పూన్ పసుపు,( Turmeric ) రోజ్ వాటర్( Rose Water ) వేసి మందపాటి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల్లో పాటు ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Telugu Besan, Coffee Powder, Face, Tips, Honey, Natural Face, Rose, Sandalwood,

ఇలా చేయడం వల్ల చర్మం( Skin ) అందంగా కనిపిస్తుంది.ఇంకా చెప్పాలంటే గంధంలో అనేక చర్మకాంతి గుణాలు ఉన్నాయి.గంధం( Sandalwood ) యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.ముందుగా గంధం పొడిలో ఒక టీ స్పూన్ బాదం నూనె మరియు ఒక టీ స్పూన్ తేనెను మిక్స్ చేయాలి.20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Telugu Besan, Coffee Powder, Face, Tips, Honey, Natural Face, Rose, Sandalwood,

ఇంకా చెప్పాలంటే ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) ఒక టేబుల్ స్పూన్ తేనె ను( Honey ) బాగా మిక్స్ చేసుకోవాలి.10 నిమిషాల తర్వాత చేతులతో ముఖాన్ని సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయాలి.ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి.

ఇవి సహజమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తాయి.ఇంకా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ శెనగపిండి, ముల్తాన్ మట్టి తీసుకోవాలి.

ఈ మూడింటిని బాగా కలిపి చర్మం పై రాసుకోవాలి.తర్వాత నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మవ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube