సినిమా పుట్టిన రోజు నుంచి నేటి వరకు ఈ రంగంలో ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయి.అందులో చాల సినిమాల్లో మల్టి స్టారర్ సినిమాలు కూడా ఉన్నాయ్.
ఇక హీరోయిన్స్ ఇద్దరు లేదా హీరోలు ఇద్దరు ఉండటం అనేది కొన్నేళ్ల క్రితం బాగా ట్రెండింగ్ లో ఉండేది.అయితే ఇలా ఎక్కువ మంది పెద్ద స్టార్స్ ఉంటె క్రేజ్ ఎక్కువగా ఉంది మార్కెట్ బాగా పెరుగుతుంది అని అంత అనుకునే వారు.
అయితే ఆలా హీరోయిన్స్ ని ఇద్దరినీ ఒకే సినిమాలో పెట్టుకోవడం వల్ల గొడవలు కూడా బాగా జరిగేవి.సినిమా ఇండస్ట్రీ వీటిని చాల సర్వ సాధారణమైన విషయాలుగా తీసుకుంటుంది.
ఇక ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టుకున్న దర్శకులకు మాత్రం అది కత్తి మీద సాము లా ఉంటుంది.ఎందుకంటే ఇద్దరికి సమానమైన సీన్స్ ఉండాలి, కథను బ్యాలెన్స్ చేయాలి లేదంటే హీరోయిన్స్ మధ్య ఈగో మొదలిపోయి చీటికి మాటికి గొడవలు అవుతుంటాయి.
ఒకవేళ ఒక హీరోయిన్ కి ఎక్కువ సీన్స్, మరొక హీరోయిన్ కి తక్కువ సీన్స్ ఉంటె ఇక గొడవలు స్టార్ట్ అయినట్టే.

అయితే కటకటాల రుద్రయ్య(Katakatala Rudrayya) సినిమా టైం లో కృష్ణం రాజు(krishnam raju) కోసం ఇద్దరు హీరోయిన్స్ అయినా జయసుధ(jaysudha) మరియు జయచిత్రాలను(jaya chitra) ఒకే చేసుకునాన్డు దర్శకుడు దాసరి నారాయణ రావు(Director Dasari Narayana Rao), అయితే ఈ సినిమా కోసం ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్న వడ్డే రమేష్ జయసుధ కు మంచి కాస్ట్యూమ్స్, స్లిప్పర్స్ వంటి అనేక సామాగ్రి తెచ్చాడట.ఎందుకంటే వీరిద్దరూ అప్పటికే ప్రేమలో ఉన్నారు.

ఇక ఈ విషయం జయచిత్ర కు తెలిసిపోయింది.పైగా ఆమెకోసం తెచ్చిన వస్తువులు మాములుగా ఉన్నాయట.దాంతో ఆమెకు కోపం నషాళానికి ఎక్కింది.
అందుకే జయసుధ ప్రేమ విషయం అందరికి తెలిసేలా చేసిందని జయచిత్ర.ఈ విషయం దాసరి వరకు వెళ్ళింది.
దాసరి ముందే జయసుధ వడ్డే రమేష్ తో ఉన్న బంధం కారణం గానే తనకు మాములు వస్తువులు తెప్పించారని జయచిత్ర అనడం తో జయసుధ కు పట్టరాని కోపం వచ్చింది.దాంతో అందరి ముందే పెద్ద గొడవ అయ్యింది.
నువ్వు పొట్టి దానివి అని జయచిత్రను జయసుధ అంటే నువ్వు చెప్పులు విప్పి కనిపించు నీ ఎత్తు తెలుస్తుంది అంటూ జయచిత్ర కౌంటర్ ఇచ్చారు.ఇక వీరి కోపాన్ని దాసరి జోక్యం చేసుకొని తగ్గించారు.
