సోషల్ మీడియాలో రైలు పట్టాలపై డిటోనేటర్లను పెట్టిన రైల్వే సిబ్బందికి సంబంధించిన వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.రైల్వే సిబ్బందే ఇలా డిటోనేటర్లను వరసగా రైలు పట్టాలపై( Railway Tracks ) అంటిస్తున్న దృశ్యాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
ప్రమాదకర చర్యగా అనుకున్న ఈ సంఘటన వెనుక ఉన్న అసలు కారణం తెలిసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.వీడియోలో కనిపించినట్లు, రైల్వే సిబ్బంది పట్టాలపై పదుల సంఖ్యలో డిటోనేటర్లను( Detonators ) వరసగా పెట్టారు.
కొన్ని క్షణాల తరువాత, ఒక రైలు అటుగా వచ్చింది.రైలు ఆ డిటోనేటర్లపైకి ఎక్కగానే ఫట్.
అంటూ గట్టిగా శబ్ధం చేస్తూ అవి పేలిపోయాయి.ఈ దృశ్యాలు చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.
మొదట ఈ సంఘటనను చూసిన వారు ఎంతో ప్రమాదకరమైందని అని భావించిన.అయితే, ఆ తర్వాత అసలు కారణం తెలిసి షాక్ అయ్యారు.పట్టాలపై పెట్టినవి డిటోనేటర్లు కాదు, ప్రమాదం తెలియజేసే క్రాకర్స్ తరహా వస్తువులు అని తెలిసింది.పొగమంచు లేదా ఇతర అడ్డంకులు ఉన్నప్పుడు, డ్రైవర్‌కి రైలును ముందుగానే ఆపే సంకేతాన్ని ఇవ్వడానికే ఇలాంటి డిటోనేటర్లను ఉపయోగిస్తారు.
రైలు వాటిపై నుంచి వెళ్లినప్పుడు పెద్ద శబ్ధం రావడం ద్వారా డ్రైవర్ అప్రమత్తమై( Alert Locopilot ) వెంటనే రైలు వేగాన్ని తగ్గిస్తాడు.
ఇక ఈ వీడియోపై సోషల్ మీడియా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.‘‘ఆలోచన బాగుంది’’ అంటూ కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు ‘‘ఇది కాస్త గతి తప్పుతే ప్రమాదకరమైన చర్యగా మారుతుందని’’ అని కామెంట్ చేస్తున్నారు.ఇలాంటి చర్యలు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరిగితే మంచిది అంటూ మరికొందరు సూచించారు.
ఈ వైరల్ వీడియో 2 లక్షలకు పైగా లైకులు సాధించడంతో పాటు, వేలాది మంది కామెంట్లు చేసారు.రైల్వే సిబ్బంది పనితీరు, వారి స్మార్ట్ ఐడియాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
రైల్వేలో మరింత భద్రత కల్పించడానికి ఇలాంటి చర్యలు అవసరమేనని చాలామంది అభిప్రాయపడ్డారు.ఇలాంటి పద్ధతులు మరింత అవగాహనతో అమలు చేయడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.