ఈ పండ్లు తింటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయ‌ట‌..తెలుసా?

కంటికి క‌నిపించని అతి సూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్ దేశవ్యాప్తంగా అల్లక‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఊపిరాడ‌క ఎంద‌రో ప్రాణాలు విడుస్తున్నారు.

 These Fruits Help To Increase Oxygen Levels In Body! Fruits, Oxygen Levels, Late-TeluguStop.com

ఇక ఈ క‌రోనా సెకెండ్ వేవ్‌లో కేవ‌లం ఇమ్యూనిటీని పెంచుకోవ‌డంపైనే కాకుండా.ఆక్సిజ‌న్ లెవ్స్‌ను పెంచుకునే ప‌నిపై కూడా ప్ర‌జ‌లు దృష్టి సారించారు.

ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌క్కువ‌గా ఉండే వారికి క‌రోనా సోకితే.వారికి కుత్రిమ ఆక్సిజ‌న్ కావాల్సి వ‌స్తుంది.

కానీ, ప్ర‌స్తుతం దేశంలో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉంది.

ఈ క్ర‌మంలోనే ఆక్సిజ‌న్ అంద‌కే చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు.

అందుకే ముందు నుంచే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.అయితే కొన్ని కొన్ని పండ్లు ఆక్సిజ‌న్ స్థాయిల‌ను పెంచ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాంటి వాటిలో అనాస పండు.అదేనండీ పైనాపిల్ కూడా ఒక‌టి.

అవును అనాస పండు తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే ఫోలేట్, థియామిన్ వంటి పోషకాలు ఆక్సిజ‌న్ లెవల్స్‌ను పెంచ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అలాగే ఏ సీజ‌న్‌లో అయినా విరి విరిగా ల‌భించే అర‌టి పండ్ల‌కు కూడా ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెంచే సామార్థ్యం ఉంది.ప్ర‌తి రోజు ఒక‌టి, రెండు అర‌టి పండ్లు తీసుకుంటే.

అందులో ఉండే పొటాషియం, ఫైబ‌ర్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు ద్వారా ఆక్సిజ‌న్ స్థాయిలు పెరుగుతాయి.

విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ఉండే బొప్పాయి పండు కూడా శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచ‌గ‌ల‌వు.అందువ‌ల్ల‌, బొప్పాయి పండును కూడా డైట్‌లో చేర్చుకోండి.వీటితో పాటు స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, కివి పండు, దానిమ్మ వంటివి కూడా ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి.

ఇక వీటితో పాటు ప్ర‌తి రోజు పావు గంట పాటు వ్యాయామం చేయాలి.నీరు అధికంగా తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube