అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప ఏ స్థాయిలో వసూళ్లను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పుష్ప 1 సాధించిన వసూళ్లను క్రాస్ చేసేలా పుష్ప 2 ఉండాలి.
అలా ఉండకుంటే ఖచ్చితంగా ట్రోల్స్ మరో రేంజ్ లో ఉంటాయి.కేజీఎఫ్ మొదటి పార్ట్ భారీ వసూళ్లు సాధించిన నేపథ్యం లో కేజీఎఫ్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి.
ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీగా తెరకెక్కించడంతో కేజీఎఫ్ 2 ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.ఇప్పుడు పుష్ప 2 కు కూడా మంచి స్క్రిప్ట్ రాస్తే ఖచ్చితంగా వెయ్యి కోట్లు అనేది అసాధ్యం అయితే కాదు అంటున్నారు.
అందుకే ఇప్పుడు సుకుమార్ ను వెయ్యి కోట్ల కోసం స్క్రిప్ట్ రాయమంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఇదే సమయంలో పుష్ప లోని తగ్గేదే లే మరియు శ్రీవల్లి డైలాగ్ బాగా ఫేమస్ అయ్యి ఏకంగా అంతర్జాతీయ స్థాయికి పుష్ప పాపులారిటీని పెంచింది.
దాంతో ఆ రేంజ్ లో పుష్ప 2 గురించి జనాలు వెయిట్ చేస్తున్నారు.పుష్ప 2 కోసం దర్శకుడు సుకుమార్ గత ఏడాదిలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు.
పుష్ప 1 విడుదల అయిన నెల రోజుల్లోనే అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సినిమా ను ప్రారంభించాలని భావించాడు.కాని సినిమాకు వచ్చిన భారీ స్పందన నేపథ్యంలో స్క్రిప్ట్ మార్చుతున్నాడు.
పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 2 ను తీసుకు రాబోతున్నాడు.పాన్ ఇండియా స్టార్స్ ను పలువురు ఈ సినిమా లో నటింపజేస్తున్నాడు.
ఇదే సమయంలో గత ఆరు నెలలుగా సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న సుకుమార్ ఎంతగా మదన పడుతున్నాడు అనేది ఒక మీమ్ రూపంలో నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు.సుకుమార్ స్క్రిప్ట్ రాసుకున్న ప్రతి సారి పుష్ప డైలాగ్ ట్రెండ్ అవ్వడం మళ్లీ అందుకు తగ్గట్లుగా లేదంటూ మళ్లీ మొదలు పెట్టడం.
ఆరు నెలలుగా ఇదే జరుగుతుంది.సుకుమార్ జుట్టు పీక్కుంటున్నట్లుగా ఈ మీమ్ లో పేర్కొన్నారు.
ఫన్నీగా ఉన్నా సుకుమార్ పరిస్థితి నిజంగా ఇలాగే ఉండి ఉంటుందని పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్న వారు అంటున్నారు.








