సాధారణంగా కొందరికి జుట్టు ఊడుతుంది కానీ కొత్త జుట్టు రాదు.దీని కారణంగా జుట్టు( Hair ) పల్చగా మారిపోతుంది.
పల్చటి జుట్టు కలిగిన వారు ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేరు.పైగా పల్చటి జుట్టు మనల్ని ఏ మాత్రం అట్రాక్టివ్ గా చూపించలేదు.
అందుకే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.హెయిర్ గ్రోత్ ను పెంచుకోవడం కోసం ఖరీదైన ఆయిల్, షాంపూ తో పాటు రకరకాల హెయిర్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు.
అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే మందులు కూడా వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ సీరం( Miracle Serum ) మీకు చాలా ఎఫెక్ట్ గా సహాయపడుతుంది.వారానికి ఒక్కసారి ఈ సీరం ను వాడితే మీ జుట్టు కొద్ది రోజుల్లోనే డబుల్ అవ్వడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ఏమాత్రం వాటర్ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో ఉల్లిపాయ జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా ఉల్లిపాయ జ్యూస్( Onion Juice ) ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, మూడు టేబుల్ స్పూన్లు ఆముదం, పది చుక్కలు లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ మరియు రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని స్పూన్ సహాయంతో ఐదారు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి.
తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరం ను నైట్ నిద్రించే ముందు స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని పడుకోవాలి.

నెక్స్ట్ డే మార్నింగ్ మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ సీరం లో సల్ఫర్ తో పాటు ప్రోటీన్ ఉంటుంది.ఇవి హెయిర్ గ్రోత్( Hair Growth ) ను అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తాయి.జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి.వారానికి ఒక్కసారి ఈ సీరంను వాడితే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు డబుల్ అవుతుంది.అలాగే ఈ సీరం లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చుండ్రును నివారించి స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తాయి.
మరియు జుట్టు రాలడాన్ని సైతం అరికడతాయి.







