25 ఏళ్లు సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సూర్య.. కార్తీ ఎమోషనల్ ట్వీట్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.1997లో నేరుక్కు నెర్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సూర్య ఇప్పటికీ పాతికేళ్ళు సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్నారు.ఈ పాతికేళ్లలో ఈయన ఏకంగా 40 సినిమాలలో నటించడమే కాకుండా పలు సినిమాలలో అతిథి పాత్రలో చేయడం అలాగే కొన్ని సినిమాలను నిర్మించడం కూడా జరిగింది.

 Surya Completed 25 Years Of Film Career Karthi Emotional Tweet Details, Surya,,e-TeluguStop.com

సూర్య కోలీవుడ్ హీరో అయినప్పటికీ ఈయన చేసిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఇక ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఇక సూర్య తన 25 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తన తమ్ముడు హీరో కార్తీ సోషల్ మీడియా వేదికగా తన అన్నయ్యతో కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ తన అన్నయ్య గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

అన్నయ్య ప్రతికూల అంశాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాత్రి పగలు కష్టపడి తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటారు.నిత్యం తన లక్ష్యంపై దృష్టి సారిస్తూ ఎప్పుడు తన మంచితనాన్ని బయట పెడుతూ కొన్ని వేల మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన ఒక గొప్ప వ్యక్తి నా అన్నయ్య అంటూ కార్తీ ఈ సందర్భంగా తన అన్నయ్య గురించి ఎంతో గొప్పగా తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు సూర్యకు 25 సంవత్సరాల కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube