ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జీవో అంశంపై విచారణ వాయిదా పడింది.ప్రభుత్వ ఆఫీసులను వైజాగ్ తరలించాలని ఇచ్చిన జీవోపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తామని తెలిపింది.కార్యాలయాల తరలింపు విషయంలో పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చే వరకు స్టే ఇస్తామని వెల్లడించింది.
ఈ క్రమంలో తమకు సమయం కావాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు.దీంతో హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.