నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు కళ్యాణ్ రామ్.
అలాగే కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంటున్నాయి.ఇటీవల కాలంలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలన్నీ కూడా హిట్ గానే నిలిచాయి.
ఇకపోతే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం NKR 21 అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

చివరగా డెవిల్( Devil ) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు కళ్యాణ్ రామ్.కాగా ఎప్పుడూ ఒకటే తరహా సినిమాల్లో మాత్రమే కాకుండా నటుడిగా ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నారు.అలా ఇప్పుడు NKR 21 ప్రాజెక్టుతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు.అందుకు తగ్గట్లే ప్రస్తుతం కష్టపడుతున్నారు.ప్రతీ విషయంలో కేర్ తీసుకుంటున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది.భారీ బడ్జెట్ తో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ( Superstar Vijayashanthi )కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా అప్డేట్లు సినిమా పై అంచనాలను భారీగా పెంచేసాయి.మూవీపై వేరే లెవెల్ బజ్ క్రియేట్ అయ్యి ఉంది.దీంతో మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని అంతా మాట్లాడుకుంటున్నారు.
కాగా ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.సినిమా అవుట్ పుట్ వేరే లెవెల్ లో వచ్చినట్లు ఇండస్ట్రీలో అంతా మాట్లాడుకుంటున్నారు.
రామ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలవనుందని చెబుతున్నారు.అన్ని విషయాల్లో మేకర్స్ పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారని డిస్కస్ చేసుకుంటున్నారు.
దీంతో ఆ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.ఈసారి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
అంతేకాకుండా ఈ సినిమా తప్పకుండా నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని తెలుస్తోంది.