టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.
తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్.లక్ష్మి కళ్యాణం సినిమాతో( Lakshmi Kalyanam ) హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పెళ్లయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే ఊపుతో వరుసగా సినిమాల్లో నటిస్తోంది.
కాగా 1985లో జూన్ 19న పంజాబీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ముంబైలో జన్మించింది కాజల్ అగర్వాల్.

స్కూలింగ్ ముంబై లోనే చేసింది. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో( St.Ann’s High School ) విద్యాభ్యాసం చేసింది.ఆ తర్వాత జై హింద్ కళాశాలలో ఇంటర్, అనంతరం మాస్ మీడియాలో గ్రాడ్యూవేషన్ కూడా పూర్తి చేసింది.2004 లో క్యూన్ హో గయా నా మూవీతో అరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత 2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే హీరోయిన్ కాజల్ అగర్వాల్ నెట్ వర్త్ దాదాపుగా రూ.67 కోట్ల వరకు ఉండవచ్చని టాక్.ఇంకా కొన్ని వెబ్సైట్లలో ఆమె దగ్గర ఉన్న ఆస్తులు రూ.90కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం.

ఇకపోతే కాజల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది.కేవలం ఇవే కాకుండా ముంబైలో రూ.6 కోట్ల విలువ గల లగ్జరీ బంగలా కూడా ఉందట.అలాగే ఆమె దగ్గర ఖరీదైన విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి.ఆడీ ఏ4, రేంజ్ రోవర్, స్కోడా అక్టావియా ఉన్నాయట.అలానే ఆమెకు బ్యూటీ ప్రొడక్ట్స్ కు సంబంధించిన కంపెనీ కూడా ఉందట.ఇవన్నీ కేవలం కాజల్ అగర్వాల్ ఆస్తులు మాత్రమే అని, తన భర్త గౌతమ్ ఆస్తులు అన్ని కలుపుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
కాజల్ భర్త గౌతమ్ ప్రముఖ బిజినెస్ మాన్ అన్న విషయం తెలిసిందే.