టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ దర్శకుడు వివి వినాయక్( V.V.Vinayak ) ఒకరు.ఈయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ యాక్షన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి అయితే ఇటీవల కాలంలో వివి వినాయక్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీలో పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు.దీంతో వివి వినాయక్ గురించి సోషల్ మీడియాలో లేనిపోని పుకార్లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా వివి వినాయక్ ఆరోగ్యం ( Health )గురించి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.అయితే ఇటీవల ఈయన ఆరోగ్య పరిస్థితి గురించే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.ఈ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఇలా వినాయక్ ఆరోగ్యం గురించి తన కుటుంబ సభ్యులు ఎక్కడ స్పందించకపోయినా ఈ వార్తలు సంచలనగా మారడంతో అభిమానులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేశారు.

ఇకపోతే తాజాగా తన ఆరోగ్యం క్షీణించిపోయిందని చాలా సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై డైరెక్టర్ వినాయక్ టీమ్ స్పందించారు.డైరెక్టర్ వివి వినాయక్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం అవాస్తవం మాత్రమేనని తెలిపారు.ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని కోరారు.ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ విధంగా వినాయక్ ఆరోగ్యం గురించి తన టీమ్ స్పందించడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది.