ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని అధిక బరువు సమస్య( Overweight ) పట్టిపీడిస్తోంది.చిన్నారుల్లో సైతం అధిక బరువు బాధితులు ఉంటున్నారు.
శరీర బరువు అదుపు తప్పడం వల్ల షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ తో సహా ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది.పైగా అధిక బరువు ఉన్నవారు ఎన్నో బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటారు.
ఈ క్రమంలోనే ఎలాగైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ ఉంటారు.నిత్యం వ్యాయామాలు చేస్తూ కఠినమైన డైట్( Weight Loss Diet ) ను ఫాలో అవుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే పొడిని రెగ్యులర్ గా కనుక తీసుకుంటే ఎటువంటి డైట్ లేకుండా బరువు తగ్గొచ్చు.

ఈ పొడిని తీసుకోవడం ద్వారా ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు.మరి ఇంతకీ ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి దోరగా వేయించుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో వేయించిన మెంతులు వేసుకోవాలి.మెంతులకు సమానంగా శొంఠి కొమ్ములు( Dry Ginger ) మరియు పసుపు కొమ్ములు వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తయారు చేసుకున్న పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున కలిపి సేవించాలి.
ప్రతిరోజు ఈ విధంగా కనుక చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.పసుపు, మెంతులు మరియు శొంఠి.ఈ మూడింటికి శరీరంలో అదనపు కొవ్వును( Cholestrol ) హరించే లక్షణాలు ఉన్నాయి.అలాగే మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలను సైతం వేగంగా కరిగిస్తాయి.

రోజు వీటితో తయారు చేసిన పొడిని తీసుకోవడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు.ఈ పొడిని నిత్యం తీసుకుంటే ఎటువంటి కఠినమైన డైట్ అక్కర్లేదు.కేవలం జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ పోషకాహారాన్ని తీసుకుంటే సరిపోతుంది.మరియు నిత్యం వ్యాయమం( Exercise ) చేయడం తద్వారా సులభంగా వెయిట్ లాస్ అవుతారు.







