జీవితంలో ఆ పని అస్సలు చేయను.... అది నా వ్యక్తిగతం... సమంత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha )ప్రస్తుతం తిరిగి సినిమాలలో బిజీ అవుతున్నారు.ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె నాగచైతన్యను ( Nagachaitanya ) పెళ్లి చేసుకుని విడాకుల ( Divorce )తర్వాత కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

 Samantha Made A Key Decision For Her Life Full Details Here, Samantha, Nagachait-TeluguStop.com

ఈ సమయంలోనే మయోసైటిసిస్ వ్యాధితో కూడా బాధపడుతున్న నేపథ్యంలో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడిప్పుడే ఈమె తిరిగి సాధారణ స్థితికి రావడంతో సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

Telugu Divorce, Nagachaitanya, Samantha, Tollywood-Movie

ఇక సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య తిరిగి శోభితను రెండవ వివాహం చేసుకున్నారు.ఈ క్రమంలోనే  సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని అందరూ భావించారు.అయితే గత కొద్దిరోజులుగా ఈమె డైరెక్టర్ రాజ్ తో చాలా చనువుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈమె కూడా ప్రేమలో పడిందని ఏ క్షణమైన ఈ శుభవార్తను అందరితో పంచుకుంటారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి.

Telugu Divorce, Nagachaitanya, Samantha, Tollywood-Movie

ఇలా సమంత గురించి ఆమె ప్రేమలో పడ్డారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత స్పందించారు.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ…జీవితంలో మళ్లీ ప్రేమలో పడాలని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు.వాటిపై ఇంక చర్చించాలనీ లేదు.అది నా పూర్తి వ్యక్తిగతమైన విషయం.దాన్ని అలాగే వ్యక్తిగతంగానే ఉంచుతాను.అంటూ చెప్పుకొచ్చింది.

సమంత చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే ఈమె తిరిగి ప్రేమలో పడే అవకాశాలే లేవని స్పష్టమవుతుంది.అయితే ప్రస్తుతం ఈమె మాత్రం పూర్తి దృష్టిని సినిమాలపైనే పెట్టినట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube