నెలకు రూ.82 వేల జీతం తీసుకుంటున్నా కూడా బతకలేకపోతున్నానంటూ ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా( Viral ) మారింది.చిన్న పట్టణంలో ఉంటూ కూడా ఇంత జీతం చాలకపోతే ఎలా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.మధ్యతరగతి( Middle Class ) బతుకు గడవడం ఎంత కష్టమో ఈ ఒక్క పోస్ట్ తో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఆ వ్యక్తికి నెలకు రూ.82 వేల జీతం వస్తుంది.ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఆఫీసులో కష్టపడి పనిచేస్తాడు.కానీ, ఆ శాలరీ తన కుటుంబానికి ఏ మాత్రం సరిపోవడం లేదట.దీనికి కారణం తలకు మించిన భారంలా మారినా హోమ్ లోన్( Home Loan ) అని అతను చెబుతున్నాడు.దాదాపు రూ.46 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడట.దీనికి ప్రతీ నెల రూ.36 వేలు ఈఎంఐ కడుతున్నాడు.చిన్న ఊర్లో ఉండటం వల్ల ఉద్యోగాలు మారే అవకాశం కూడా లేదు.
వేరే ఊరికి వెళ్లలేడు ఎందుకంటే కుటుంబ పరిస్థితులు సహకరించవు.

అందుకే నెలకు అదనంగా 15 వేల నుంచి 20 వేల రూపాయలు సంపాదించాలని చూస్తున్నాడు.తనకున్న టాలెంట్స్ గురించి కూడా చెప్పాడు.పబ్లిక్ స్పీకింగ్ బాగా చేస్తాననీ, కస్టమర్ సర్వీస్ లో ఎక్స్పీరియన్స్ ఉందని, కాన్వా, పవర్ పాయింట్ డిజైనింగ్ కూడా వచ్చని తెలిపాడు.
తన షెడ్యూల్ కు తగ్గట్టు ఏదైనా పని ఉంటే చెప్పమని అడుగుతున్నాడు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
కొంతమంది 82 వేల రూపాయలు కూడా చాలడం లేదా అని ఆశ్చర్యపోతే, మరికొందరు మాత్రం అతడి కష్టాన్ని అర్థం చేసుకున్నారు.
కొందరు యూజర్లు స్కిల్స్ పెంచుకుని మంచి శాలరీ వచ్చే ఉద్యోగం చూడమని సలహా ఇచ్చారు.
ఇంకొందరేమో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయమని లేదా ఫ్రీలాన్సింగ్ చేయమని చెప్పారు.ఆన్‌లైన్‌లో చాలా అవకాశాలు ఉన్నాయని, వాటి ద్వారా మంచి డబ్బు సంపాదించొచ్చని అన్నారు.

మరికొందరు మాత్రం సెకండ్ జాబ్( Second Job ) కంటే సైడ్ హస్టిల్స్ బెటర్ అని సలహా ఇచ్చారు.ఎందుకంటే ఇప్పటికే 9-6 ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి, ఫుల్ టైమ్ జాబ్ చేయడం కష్టం అవుతుందని అభిప్రాయపడ్డారు.ఒక యూజర్ అయితే ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే ఐడియాల గురించి డిస్కస్ చేద్దామని అతనికి మెసేజ్ కూడా పెట్టాడు.
అందరికంటే భిన్నంగా ఒక యూజర్ మాత్రం అదిరిపోయే సలహా ఇచ్చాడు.
లోకల్ ఎంబీఏ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేయమని చెప్పాడు.అతనికి పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇష్టం కాబట్టి, బిజినెస్ స్ట్రాటజీస్, వార్ టెక్నిక్స్ లాంటి టాపిక్స్ మీద క్లాసులు తీసుకోవచ్చని అన్నాడు.
ఇది స్టూడెంట్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, కాలేజీలకు కూడా గెస్ట్ ఫ్యాకల్టీ అవసరం అవుతుందని చెప్పాడు.
మొత్తానికి, ఈ పోస్ట్ ఒక విషయం స్పష్టం చేసింది.
జీతం ఎంత ఉన్నా, ఖర్చులు పెరిగిపోతే బతకడం కష్టమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా హోమ్ లోన్ ఈఎంఐలు లాంటివి ఉంటే మధ్యతరగతి ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో ఈ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.







