వామ్మో, అమ్మాయిలు ఇంత డేంజర్‌గా ఉంటారా.. ప్రియుడికి విషమిచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. చివరకు..?

విల్లుపురం( Villupuram ) దగ్గర జరిగిన ఓ దారుణ ఘటన అందరినీ షాక్‌కి గురిచేసింది.ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పాడని కక్ష పెంచుకుని సొంత ప్రియుడికే విషం( Poison ) పెట్టింది.

 Tamil Nadu College Girl Gave Boyfriend Rat Poison Viral Details, Tamil Nadu Crim-TeluguStop.com

రామి అనే ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ చేసిన ఈ పనికి జయసూర్య (24)( Jayasurya ) అనే యువకుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.అతడి కిడ్నీలు కూడా ఫెయిలయ్యే స్టేజ్‌కి వచ్చేశాయి.

ప్రస్తుతం రామి, ఆమె కుటుంబం పరారీలో ఉన్నారు.

కిరిమేడు గ్రామానికి చెందిన జయసూర్య లా స్టూడెంట్.

అతడు రెండో సంవత్సరం చదువుతున్నాడు.పక్కింట్లోనే ఉండే రామి( Ramy ) అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

రామి ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇద్దరూ ప్రేమించుకున్నారు కానీ జయసూర్య ఇంట్లో వాళ్లకి ఈ ప్రేమ ఇష్టం లేదు.

వాళ్లిద్దరూ అన్నాచెల్లెల్లా ఉంటారని, ఈ ప్రేమ వద్దని జయసూర్యకి చెప్పారు.దీంతో ఫ్యామిలీ కోసం జయసూర్య రామికి బ్రేకప్( Breakup ) చెప్పేశాడు.

Telugu Breakup Revenge, Boyfriend, India, Love Story, Relationship, Poison, Tami

కానీ రామి మాత్రం ఈ బ్రేకప్‌ని తట్టుకోలేకపోయింది.జయసూర్యకి సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్న ఫొటోలు పంపింది.చేతులు కోసుకుని రక్తం కారుతున్న ఫొటోలు చూపిస్తూ భయపెట్టింది.ఒకవేళ మళ్లీ కలవకపోతే చచ్చిపోతానని బెదిరించింది.కానీ జయసూర్య మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు.

ఫిబ్రవరి 2వ తేదీన రామి జయసూర్య ఇంటికి వెళ్లింది.

ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి మరీ వెళ్లింది.జయసూర్యతో చాలా మామూలుగా మాట్లాడింది.

టీ పెడతానని చెప్పి ఇంట్లోకి వెళ్లింది.జయసూర్యకి తెలియకుండానే టీలో ఎలుకల మందు( Rat Poison ) కలిపేసింది.“ర్యాట్ పేస్టు” అని లోకల్‌గా పిలిచే ఆ డేంజరస్ పాయిజన్‌ని టీలో( Tea ) వేసి అతడికి ఇచ్చింది.అది తాగిన తర్వాత రామి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Telugu Breakup Revenge, Boyfriend, India, Love Story, Relationship, Poison, Tami

రాత్రి 9:30 గంటల టైమ్‌లో రామి మళ్లీ జయసూర్యకి వాట్సాప్‌లో మెసేజ్ చేసింది.“నీకు ఒంట్లో బాలేదా?” అని అడిగింది.అవునని జయసూర్య రిప్లై ఇవ్వగానే.తనే విషం కలిపానని షాకింగ్ నిజం చెప్పింది.విషయం అర్థం చేసుకున్న జయసూర్య వెంటనే వాంతి చేసుకోవడానికి ట్రై చేశాడు కానీ కాలేదు.రాత్రి 11 గంటలకల్లా అతడి పరిస్థితి సీరియస్‌గా మారింది.

ఫ్రెండ్స్ వెంటనే మడపట్టులోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశాక, విల్లుపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కి, ఆ తర్వాత చెన్నై స్టాన్లీ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు.

డాక్టర్లు టెస్ట్ చేసి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు.జయసూర్య పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది.

జయసూర్య పేరెంట్స్‌కి విషయం చెప్పగానే వాళ్లు వెంటనే ఫోన్ చెక్ చేశారు.రామి పంపిన వాట్సాప్ మెసేజ్‌లు చూసి షాకయ్యారు.వెంటనే తిరువెన్నైనల్లూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు.విల్లుపురం డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రామి, ఆమె ఫ్యామిలీ ఊరు వదిలి పారిపోయారు.పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube