ఆఫీసర్ గారి 'ఇంటికి రావే' వేధింపులు.. ఆసుపత్రిలోనే చితక్కొట్టిన మహిళా సిబ్బంది.. వీడియో వైరల్!

జైపూర్ లోని( Jaipur ) ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ మహేష్ గుప్తా( Mahesh Gupta ) లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

 Jaipur Cancer Institute Senior Officer Beaten By Women Nursing Staff For Dirty M-TeluguStop.com

ఆయన చేస్తున్న వేధింపులకు విసిగిపోయిన మహిళా సిబ్బంది ఏకంగా ఆసుపత్రిలోనే చితక్కొట్టారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే, మహిళా సెక్యూరిటీ గార్డు( Woman Security Guard ) గుప్తాని కాలర్ పట్టుకుని క్యాబిన్ నుంచి బయటకు లాక్కొచ్చింది.మిగతా మహిళా సిబ్బంది కూడా తోపులాట చేశారు.“అందరితోనూ తప్పుగా ప్రవర్తిస్తున్నావ్” అంటూ ఒక మహిళ నిలదీసింది.గుప్తా మాత్రం “నన్ను వదిలెయ్యండి ప్లీజ్” అంటూ బతిమాలాడు.కానీ మహిళా సిబ్బంది ఆగలేదు.“పోలీస్ స్టేషన్ కు తీసుకుపోదాం పదండి” అంటూ గుప్తాను బయటకు ఈడ్చుకెళ్లారు.

గుప్తా మహిళా ఉద్యోగులను( Female Staff ) అసభ్యంగా వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.“హోటల్స్ లేదా ఫ్లాట్లకు రమ్మని పిలిచేవాడు” అని ఒక మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది.“అతని మాట వినకపోతే ఉద్యోగాలు పీకేస్తానని బెదిరించేవాడు” అని ఇంకో బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది.వీడియో చివర్లో ఒక మహిళా సెక్యూరిటీ గార్డు గుప్తా చెంప పగలకొట్టింది.“వీడియో తీయండి” అంటూ మిగతా వాళ్లకు చెప్పింది.

గుప్తా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించాడు.“నేను ఏ తప్పు చేయలేదు.నా పిల్లలపై ఒట్టు” అంటూ గుప్తా వాపోయాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా( Viral ) మారడంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.కొందరు మహిళా సిబ్బందికి మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం చట్టపరమైన ప్రక్రియను ఎందుకు పాటించలేదని ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా ఈ ఘటన మాత్రం హాట్ టాపిక్ గా మారింది.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

మహిళలది తప్పా రైటా అనేది కామెంట్ చేయండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube