అధిక కొలెస్ట్రాల్.చాలా మందిని కామన్‌గా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
కణాలు ఆరోగ్యంగా ఉండటానికి, హార్మోన్ల తయారీకి కొలెస్ట్రాల్ చాలా అవసరం.అలా అని అవసరం అయిన దానికంటే ఎక్కువగా శరీరానికి కొలెస్ట్రాల్ అందిస్తే.
చివరకు అనేక సయస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది.
గుండె జబ్బులు వచ్చే అవకాశం, రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడే అవకాశం పెరిగిపోతాయి.మరియు అనేక జబ్బులకు కూడా దారి తీస్తాయి.
కాబట్టి, శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవడం చాలా అవసరం.
అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.
సూపర్ ఫాస్ట్‌గా అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు.దాల్చిన చెక్క.
అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.అందువల్ల, ఉదయం లేవగానే ఒక గ్లాస్ వాటర్‌లో దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరిగించి.
వడగట్టుకోవాలి.గోరు వెచ్చగా అయిన తర్వాత ఈ దాల్చిన చెక్క వాటర్‌ను సేవించాలి.
ఈ వాటర్‌ను రెగ్యులర్‌గా దాగితే కొలెస్ట్రాల్ త్వరగా కరుగుతుంది.అలాగే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అని భావించే వారు ఎప్పుడూ ఆహారాన్ని మితంగా తీసుకోవాలి.
అంటే ఒకేసారి కాకుండా.రోజులు ఏడు, ఎనిమిది సార్లు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి.
అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో వెల్లుల్లి కూడా గ్రేట్‌గా ఉపయోగపడుతుంది.కాబట్టి, వెల్లల్లి ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోండి.ఉల్లిపాయలు కూడా కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు వైట్ రైస్, బ్రెడ్ వంటి వాటికి దూరంగా ఉండి.ఓట్స్, త్రుణ ధాన్యాలు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.
అదేవిధంగా, అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఆరెంజ్ జ్యూస్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.
కాబట్టి, ప్రతి రోజు ఖచ్చితంగా ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ సేవించండి.ఇక ఈ ఆహారం తీసుకోవడంతో పాలు ప్రతి రోజు ఒక అరగంట నుంచి గంట పాటు వ్యాయామం చేయాలి.
అప్పుడు త్వరలోగా కొలెస్ట్రాల్ కరుగుతుంది.