ప్రవాస భారతీయులకు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరపాలక సంస్థ ‘‘బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ’’( Bruhat Bengaluru Mahanagara Palike ) శుభవార్త చెప్పింది.తన కొత్త డిజిటలైజ్డ్ సిస్టమ్‌లో ఈ- ఖాతాను( e-khata ) భద్రపరచడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి నిబంధనను ఎత్తివేసింది.
దీని వల్ల బెంగళూరులో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు ఈ – ఖాతా తప్పనిసరి నిబంధనతో ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు( NRI’s ) ఉపశమనం లభించినట్లయ్యింది.దీంతో బెంగళూరులో ఆస్తులు ఉన్న ఎన్ఆర్ఐలు భూ లావాదేవీలను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు.
కర్ణాటక ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఈ – ఖాతాను తప్పనిసరి చేసింది.ఈ క్రమంలో అక్టోబర్ 1న బీబీఎంపీ ఫేస్‌లెస్, కాంటాక్ట్‌లెస్, ఆన్‌లైన్ ఈ – ఖాతా జారీ వ్యవస్ధను రూపొందించింది.
తాజా డేటా ప్రకారం ఆస్తుల యజమానులు దాదాపు ఆరు లక్షలకు పైగా డ్రాప్ట్ ఈ – ఖాతాలను డౌన్‌లోడ్ చేసుకున్నారని కర్ణాటక ప్రభుత్వం( Karnataka Government ) చెబుతోంది.తొలుత ఆస్తి యజమానులు ఈ – ఖాతాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి బీబీఎంపీ ఆధార్‌ను తప్పనిసరి చేసింది.
అయితే చాలా మంది ఎన్ఆర్ఐ యజమానులకు ఆధార్( Aadhar ) లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో బీబీఎంపీ ఆధార్‌ను ఆప్షనల్ చేసింది.ఈ – ఖాతా పొందాలనుకునే ఎన్ఆర్ఐలు పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్‌ని సమర్పించవచ్చని బీబీఎంపీ పేర్కొంది.అయితే వారు ఈ – ఖాతా కోసం దరఖాస్తు చేయడానికి అసిస్టెంట్ రెవెన్యూ ఆఫీసర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.
ఏఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తుదారుడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అందించాల్సి ఉంటుంది.కాగా.బెంగళూరు వంటి కాస్మోపాలిటిన్ సిటీలో చాలా మంది ఎన్ఆర్ఐలు పెట్టుబడి సాధానంగా ఆస్తులను కొనుగోలు చేసి వాటిని లాభానికి విక్రయిస్తారు.
బీబీఎంపీ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.ఇది ఎన్ఆర్ఐలకు పెద్ద ఉపశమనం అన్నారు.విదేశాల్లో నివసిస్తున్నందున చాలా మంది ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డ్ లేదని, కానీ వారు నగరంలోని పలు రియల్ ఎస్టేట్ వెంచర్‌లలో పెట్టుబడులు పెడతారని తెలిపారు.