సినీ నటుడు నాగచైతన్య ( Nagachaitanya )శోభిత ( Sobhita ) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.వీరిద్దరూ డిసెంబర్ 4వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు.
సమంతకు ( Samantha ) విడాకులు ఇచ్చిన నాగచైతన్య తిరిగి శోభిత ప్రేమలో పడ్డారు ఈ క్రమంలోనే ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేయడం పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు.ఇక త్వరలోనే వీరి వివాహం కూడా జరగబోతున్న నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇక నాగచైతన్య శోభిత పెళ్లికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరు పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా నాగచైతన్య శోభిత పెళ్లి వేడుక నెట్ ఫ్లిక్స్ ( Net Flix ) లో ప్రసారం కాబోతుందని వీరి పెళ్లికి సంబంధించి స్క్రీనింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా 50 కోట్లకు కైవసం చేసుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.గత నాలుగు రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో అందరూ నిజమేనని భావించారు.ఈ క్రమంలోనే కొంతమంది ఈ విషయంపై నాగచైతన్య శోభిత పట్ల విమర్శలు చేస్తున్నారు.
ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని, వీరి పెళ్లికి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ ఎవరు కొనుగోలు చేయలేదని, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని చైతన్య టీం ఖండించారు.దీంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.ఇక వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8: 13 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఇక వీరి వివాహాన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలోనే జరుపబోతున్నట్లు ఇదివరకే ఓ సందర్భంలో నాగార్జున వెల్లడించారు.