జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? ఎంత ఖరీదైన ఉత్పత్తులను వాడిన ప్రయోజనం ఉండటం లేదా.? హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యకు ఎలా చెక్ పెట్టాలో అర్థం కావడం లేదా.? అయితే అస్సలు వర్రీ అవకండి.మీరు ఒత్తిడిని పెంచుకునే కొద్ది జుట్టు మరింత ఎక్కువగా రాలుతుంది.మొదట ఒత్తిడికి దూరంగా ఉండండి.డైట్ లో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, సీడ్స్, మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు, పాలు, చేపలు వంటి పోషకాలతో కూడిన ఆహారాలను చేర్చుకోండి.అన్ హెల్తీ ఫుడ్ అవైడ్ చేయండి.
ఇకపోతే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు జుట్టు రాలడాన్ని ఆపడానికి అద్భుతంగా తోడ్పడతాయి.ముఖ్యంగా తల స్నానానికి ముందు ఇప్పుడు చెప్పబోయే చిన్న టిప్ ను కనుక ఫాలో అయ్యారంటే హెయిర్ ఫాల్ మీ వంక కూడా చూడదు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్( Glass of water ) పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక రెండు టీ స్పూన్లు టీ పౌడర్ ( Tea powder )వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతి పిండి( Fenugreek flour ), రెండు రెబ్బలు కరివేపాకు( curry leaves ) వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాయిల్ చేయండి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరువెచ్చగా అయ్యాక వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ న్యాచురల్ టానిక్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే పోషణ అందుతుంది.అలాగే ఈ టానిక్ ను వాడటం వల్ల వైట్ హెయిర్ త్వరగా రాకుండా ఉంటుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.
జుట్టు ఒత్తుగా పొడుగ్గా సైతం మారుతుంది.