ప్రస్తుత రోజులలో చాలా మంది ఏ చిన్న వస్తువు కావాలన్నా కానీ బయటకు వెళ్లి కొనడం కన్నా ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని డైరెక్ట్ గా ఇంటికి తెప్పించుకుంటూ ఉన్నారు.ఈ క్రమంలో తాజాగా ముంబైకు( Mumbai ) చెందిన ఒక యువతకి చిక్కు ఎదురైంది.
ఇందులో భాగంగా నాసిరక ఆహార ఉత్పత్తిని డెలివరీ చేసిన ఫ్లిప్కార్ట్ పై కేసు నమోదు చేసింది.దీంతో ఈ-కామర్స్ దిగ్గజా ప్లాట్ ఫామ్ అయినా ఫ్లిప్కార్ట్ ( Flipkart )కు గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి.
ఈ క్రమంలో కోర్టు కస్టమర్ కు పదివేల రూపాయలు చెల్లించాలని ఈ కామర్స్ ప్లాట్ఫామ్, అలాగే ఆ ప్రోడక్ట్ సెల్లార్ కు ఆదేశించడం జరిగింది.అయితే, నో రిటర్న్ పాలసీ కారణంగా ఆ ఉత్పత్తిని రిటర్న్ తీసుకోవడానికి కుదరదని ఫ్లిప్కార్ట్ వాళ్లు తెలియచేశారు అంటూ వినియోగదారుల ఫారంలో ఆ మహిళ తెలియజేసింది.
ప్రోడక్ట్స్ డెలివరీ చేసేముందు ప్రోడక్ట్ నాణ్యత తెలుసుకోవాలి అంటూ బాధ్యత ఫ్లిప్కార్ట్ యూజర్ తెలియచేసింది.
ఆ మహిళ ఎవరో కాదు.గోరేగావ్ ( Goregaon )నివాసి తరుణ రాజ్పుత్( Taruna Rajput ).ఈ కేసులో భాగంగా కంపెనీ డైరెక్టర్ లపై కేసు నమోదు చేయగా న్యాయస్థానం అందుకు డైరెక్టర్ పై కేసు కొట్టేసి ఫ్లిప్కార్ట్, విక్రయితకు మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.అసలు కేసు విషయానికి వస్తే.ఫ్లిప్కార్ట్ అమ్మకానికి ఉంచిన హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఆఫ్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఆర్డర్ చేసింది.ఇందుకోసం ఆ మహిళ రూ.4,641/- చెల్లించగా ఆర్డర్ చేసిన ఐదు రోజులకు ఆర్డర్ డెలివరీ అవ్వడం జరిగింది.కానీ, ఆమె వెంటనే ఆ ప్రోడక్ట్ ఉపయోగించకుండా పక్కన పెట్టారు.ఆహార పదార్ధం వచ్చిన వారం అనంతరం ఓపెన్ చేసి చూడగా అప్పటికే ఆహార ఉత్పత్తి రంగు ఆకృతి పూర్తిగా మారిపోయింది.
అంతేకాకుండా, ఆ ఉత్పత్తి లేబుల్ పై ఎలా వాడుకోవడం అనే సమాచారం లేకపోవడానికి కూడా ఆమె గమనించి వెంటనే ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి నకిలీ ఉత్పత్తిని డెలివరీ చేశారు అంటూ.కరెక్ట్ ఉత్పత్తిని పంపించాలని ఫ్లిప్కార్ట్ వారిని కోరింది.
కానీ, కస్టమర్ కేర్ వారు ఆ ఉత్పత్తికి ఎలాంటి రిటర్న్ పాలసీ లేదు అంటూ ఫ్లిప్కార్ట్ వారు ఆమె చేసిన రిక్వెస్ట్ ను తిరస్కరించింది.
అనంతరం సంబంధిత ప్రోడక్ట్ ఫోటోలు తీసి ఫ్లిప్కార్ట్ కు ఆమె పంపారు.అయినా కానీ కంపెనీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమెకు కోపం వచ్చి కేసు నమోదు చేశారు.పాడు అయిపోయిన ఉత్పత్తిని వెనక్కు తీసుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు అంటూ ఆమె వినియోగదారుల ఫారంలో అభిప్రాయాన్ని తెలియజేసింది.
అంతే కాకుండా, నకిలీ ఉత్పత్తిని ఆమెకు డెలివరీ చేసినట్లు వాదించారు తరుణ రాజ్పుత్.తనకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫ్లిప్కార్ట్ కు కోరగా చివరకు హానికరమైన పదార్థాలు లేదా ఉత్పత్తి నకిలీ దాని రుజువు చేయడంలో ఆ మహిళ విఫలం అయింది.
దీంతో కోర్టు ఆ మహిళ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయలేదు.ఈ ఫ్లిప్కార్ట్ కు చెల్లించిన అమౌంట్ అలాగే పదివేల రూపాయలు ఫైన్ కూడా చెల్లించాలని ఫ్లిప్కార్ట్ కు ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా డబ్బు చెల్లింపు జరిగే వరకు 9% వడ్డీ కూడా ఫిర్యాదుదారుడుకి చెల్లించాలని ఫ్లిప్కార్ట్ తో పాటు విక్రయితంగా ఉన్న వారికి కూడా కోర్టు ఆదేశాలు దారి చేసింది.