శనివారం నాడు మహారాష్ట్ర, డోంబివ్లి సిటీ,( Dombivli City ) దేవిచపాడ ప్రాంతంలో ఊహించని ప్రమాదం జరిగింది.13 అంతస్తుల భవంతిలోని మూడో ఫ్లోర్ నుంచి రెండేళ్ల పసి బాలుడు( Toddler ) జారి కింద పడిపోయాడు.కానీ, ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది.భూమికి చేరేలోపే ఓ యువకుడు మెరుపులా కదిలి ఆ బిడ్డ ప్రాణాల్ని కాపాడాడు.ఈ విజువల్స్ దగ్గరలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో కనిపించినట్లుగా భవనం బయట నిల్చున్న భావేష్ మత్రే( Bhavesh Mhatre ) అనే యువకుడు పైనుంచి పిల్లాడు పడటం గమనించాడు.
అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరుగున వెళ్లి, పిల్లాడిని ఒడిసి పట్టడానికి సిద్ధంగా నిలబడ్డాడు.పసివాడు నేరుగా భావేష్ కాళ్లపై పడ్డాడు.ఆ దెబ్బకి గాయం తీవ్రత తగ్గింది.ఆ చిన్నారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.
వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.సకాలంలో వైద్యం అందడంతో పిల్లాడు పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాడు.భావేష్ అప్రమత్తత, ధైర్యం వల్లే పెను ప్రమాదం తప్పిపోయింది.అతని నిస్వార్థ సేవకు చుట్టుపక్కల వారు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తమ్రీన్ సుల్తానా అనే యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.“13వ అంతస్తు నుంచి పడుతున్న పసిపిల్లవాడిని కాపాడిన రియల్ హీరో.థానేలోని ఎత్తైన భవంతి మూడో అంతస్తు నుంచి పడిపోయిన రెండేళ్ల పిల్లవాడు అదృష్టవశాత్తు క్షేమంగా ఉన్నాడు.ఒక వ్యక్తి అప్రమత్తతతో ఈ ప్రమాదం తప్పింది” అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఈ వీడియో వైరల్( Viral Video ) కావడంతో చాలామంది భావేష్‌ను రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.అతని చొరవ, ధైర్యం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.అప్రమత్తంగా ఉంటే, నిస్వార్థంగా స్పందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని భావేష్ నిరూపించాడు.
“భావేష్ చేసిన ఈ వీరోచిత పని మానవత్వానికి, ధైర్యానికి గొప్ప ఉదాహరణగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.భావేష్ లాంటి రియల్ హీరోలు మన మధ్య ఉండటం నిజంగా గర్వకారణం.” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.