మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా శంకర్( Shankar ) దర్శకత్వంలో తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్( Game Changer ).ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి.

ఇలా రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రంలో అంజలి, కీయారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ బడ్జెట్ చిత్రంగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజుకు భారీ నష్టాలను కూడా తీసుకువచ్చిందని చెప్పాలి.అయితే థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్( Amazon Prime Video ) కైవసం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేశారు.జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతుంది.ఇలా నెల తిరగకుండానే ఓపాన్ ఇండియా సినిమా ఓటీటీలోకి రావటం గమనార్హం.
మరి థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.