బీహార్‌లోని( Bihar ) పూర్ణియాలో ప్రభుత్వ పాఠశాల అమ్మాయిలు దారుణంగా కొట్టుకున్నారు.వాళ్లు ఒకే లవర్( Lover ) కోసం గొడవ పడ్డారంట, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్కూల్ యూనిఫాంలో ఉన్న అమ్మాయిలు( Girls ) రోడ్డుపై పిచ్చిపిచ్చిగా కొట్టుకుంటున్నారు.పిడిగుద్దులు, తన్నులు, జుట్టు పట్టుకుని లాక్కోవడం, యూనిఫామ్‌లు చింపేసుకోవడం, ఒకటేమిటి చాలా రచ్చ రచ్చ చేశారు.
ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయితో చాటింగ్ చేస్తున్నారని, డేటింగ్ చేస్తున్నారని తెలిసిందట.దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది.ఒకరికొకరు వార్నింగ్ కూడా ఇచ్చుకున్నారు.కానీ కొన్ని రోజుల తర్వాత, గొడవ కాస్తా తన్నుల వరకు వెళ్లింది.
క్లాసులు అయిపోయాక స్కూల్ బయట ఇద్దరు అమ్మాయిలు, వాళ్ల ఫ్రెండ్స్ కలిసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
కొందరు అమ్మాయిలు పిడిగుద్దులు గుద్దుతూ, తన్నుతూ ఉంటే, మరికొందరు జుట్టు పట్టుకుని లాగుతూ, కేకలు వేస్తూ కనిపించారు.ఒక వ్యక్తి ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.అంతే, వీడియో క్షణాల్లో వైరల్( Viral Video ) అయిపోయింది.
వీడియో తీస్తున్న వ్యక్తి అమ్మాయిలను ఆపమని చెబుతున్నా వాళ్లు మాత్రం వినకుండా కొట్టుకుంటూనే ఉన్నారు.చివరికి మిగతా స్టూడెంట్స్( Students ) వచ్చి వారిని విడదీశారు.
కొంతమంది జనాలు మాత్రం నవ్వుతూ చూస్తూ ఊరుకున్నారు.
ఈ గొడవ ఎక్కడ జరిగిందో ఇంకా తెలియలేదు, వీడియో నిజమైనదా కాదా అనేది కూడా కన్ఫర్మ్ కాలేదు.ఇప్పటివరకు పోలీసులు కానీ, స్కూల్ అధికారులు కానీ ఈ అమ్మాయిలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఈ క్లిప్ ను మీరు కూడా చూసేయండి.ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి.
వాటిని చూసే చాలామంది భారతీయ అమ్మాయి ల గురించి చాలా ఆందోళన వ్యక్తం చేశారు.మంచి భవిష్యత్తును ఇలా చేజేతులా నాశనం చేసుకోవడానికి చూసి విచారణ వ్యక్తం చేశారు.