సీనియర్ హీరో రాజశేఖర్( Hero Rajashekar ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.రాజశేఖర్ హీరోగా నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
రాజశేఖర్ కు అప్పట్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉండేది.ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాలలో ఎక్కువగా నటించిన రాజశేఖర్ ఆ సినిమాలతో కలెక్షన్ల విషయంలో సైతం ఒకింత సంచలనాలను క్రియేట్ చేశారు.
సీనియర్ హీరో రాజశేఖర్ కు మూవీ ఆఫర్లు( Rajashekar Movie Offers ) తగ్గడానికి మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలలో నటించకపోవడమే అని చెప్పవచ్చు.రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినా సెకండ్ ఇన్నింగ్స్ ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే.
వరుస ఫ్లాపులు కూడా రాజశేఖర్ కు ఒకింత మైనస్ అయ్యాయని చెప్పవచ్చు.రాజశేఖర్ మంచి రోల్స్ ను ఎంచుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ సాధించవచ్చు.

రాజశేఖర్ నటించిన కొన్ని సినిమాలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.రాజశేఖర్ తన సినీ కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలలో( Remake Movies ) నటించడం గమనార్హం.రాజశేఖర్ వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటే కెరీర్ పరంగా సంచలనాలను సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు.రెమ్యునరేషన్ విషయంలో రాజశేఖర్ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

రెమ్యునరేషన్ సమస్య వల్ల రాజశేఖర్ కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజశేఖర్ కూతుళ్లు సినిమాలలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.రాజశేఖర్ వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.రాజశేఖర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఆర్టిస్టుల కొరత ఉందనే సంగతి తెలిసిందే.రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కు ఓకే చెబితే ఆ కొరత కొంతమేర భర్తీ అవుతుందని చెప్పవచ్చు.







