నవరాత్రులలో తులసి పూజ ఈ విధంగా చేయడం వలన ధనయోగం..!

ప్రస్తుతం దేవి శరన్నవరాత్రులు ( Devi Sharannavaratra )కొనసాగుతూ ఉన్నాయి.అయితే దేవీ శరన్నవరాత్రుల సమయంలో ఇంట్లో ఆర్థిక లాభాలు చేకూర్చే, ధనయోగం కలగడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి.

 Dhanayoga By Doing Tulsi Puja In Navratri In This Way , Devi Sharannavaratra-TeluguStop.com

అవి పాటిస్తే తమ ఇంట్లో ఆర్థిక లాభాలు అలాగే ధనయోగం కలుగుతుందని పండితులు ( Scholars )చెబుతున్నారు.ముఖ్యంగా తులసి మొక్కకు దేవి శరన్నవరాత్రులలో పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుంది.

అసలు దేవీ నవరాత్రుల సమయంలో తురసమ్మకు చేయవలసిన పూజలు ఏవి? అలాగే పరిహారాలు ఏవి? ఇప్పుడు మనం తెలుసుకుందాం.సనాతన ధర్మం( Sanatana Dharma )లో తులసి సంపదకు దేవత అయిన లక్ష్మీ గా పరిగణించబడుతుంది.

Telugu Basil, Devotional, Goddess Durga, Goddess Lakshmi, Sanatana Dharma, Schol

అయితే తులసిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.ఇక తులసి మొక్కకు హిందూ మతంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది.ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండడం వలన సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తులసి మొక్క ఇంటికి ఆనందాన్ని అలాగే శ్రేయస్సును కలిగిస్తుంది.ఇక నవరాత్రుల సమయంలో మీ ఇంట్లో తులసి మొక్కకు ఈ పరిహారాలను, పూజలను చేయడం వలన ఇల్లు సంపదలతో నిండిపోతుంది. నవరాత్రులలో గురువారంనాడు తులసి మొక్కకు పచ్చిపాలను సమర్పించడం మంచిది.

ఇది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది.అలాగే ఇంటికి ఆర్థిక శ్రేయస్సును కూడా తీసుకువస్తుంది.

నవరాత్రులలో తులసి మొక్క దగ్గర సాయంత్రం పూట దీపాలను కచ్చితంగా వెలిగించాలి.ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Basil, Devotional, Goddess Durga, Goddess Lakshmi, Sanatana Dharma, Schol

అంతేకాకుండా నవరాత్రులలో ప్రతిరోజు తులసికి( Basil ) ప్రదక్షిణ చేయడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది.నవరాత్రులలో మొత్తం తొమ్మిది రోజుల పాటు తులసిని పూజించడం వలన ఇంట్లో అనారోగ్యంతో బాధపడే వ్యక్తులకు ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి.నవరాత్రులలో తులసి మొక్కకు పొరపాటున కూడా తాకకూడదు.ఒకవేళ తాకితే లక్ష్మి దేవికి కోపం వస్తుంది.అందుకే నవరాత్రులలో ప్రతిరోజు తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి( Goddess Lakshmi ) అనుగ్రహం ఉంటుంది.

సాధ్యమైతే తప్పక నవరాత్రులలో తల్లి దుర్గాదేవి( Goddess Durga )తో పాటు తులసి మొక్కకు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube