మన భారత దేశంలో చాలా చిన్నచిన్న నదులు ఎన్నో ఉన్నాయి.కొన్ని ప్రముఖమైన పెద్ద పెద్ద నదులు మాత్రం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి తుంగభద్ర, పెన్నా, కావేరి, గంగా నదులు ఉత్తర కర్ణాటకలోని సిర్సి కి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఒక నది కనిపిస్తుంది.ఆ నది లో ఒక అద్భుతమైన దృశ్యం ఉంది.
దట్టమైన అడవుల్లో గుండా ఉన్న ఈ నది ఎంతో అద్భుతంగా ఎన్నో రాళ్లను గుట్టలను దాటుకుంటూ ప్రయాణం చేస్తుంది.సాధారణంగా కార్తీక మాసం, శివరాత్రి సమయాలలో భారీగా భక్తులు, పర్యాటకులు భక్తితో ఈ నది దగ్గరికి వస్తూ ఉంటారు.
ఈ నదిలో సహస్ర లింగాలు కొలువు తీరడమే కాదు, ప్రతి శివలింగానికి ఎదురుగా ఒక నంది కూడా ఉంటుంది.ఈ సహస్ర శివలింగాలను ఎవరు నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం.
స్థల పురాణాల ప్రకారం 1678, 1718 ఆ సమయాలలో ఆ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన సామంతుడైన సదాశివ రాయలు అనే రాజు ఈ సిర్సి ప్రాంతాన్ని పరిపాలించాడు.

ఆ రాజు ఈ ప్రదేశంలో సహస్ర లింగాలను నిర్మించాడని పురాణాలలో ఉంది.సంతానం లేని ఆ రాజు పరమాశివుడిని ప్రార్థించి తనకు సంతానం కలిగేలా చేస్తే సహస్ర లింగాలను నిర్మిస్తానని మొక్కుకున్నాడు.ఆ తరువాత కొద్ది రోజులకు ఆ రాజుకు కుమార్తె జన్మించడంతో శంకరుడిని ప్రార్థించి ఇక్కడి రాళ్లపై చిన్నచిన్న లింగాలను వాటికి ఎదురుగా నందులను కూడా చేయించాడు.1000 లింగాలు చేయిస్తానని రాజు మొక్కుకున్నప్పటికీ ఈ నదిలో వేయికన్నా ఎక్కువే లింగాలు ఉన్నాయని అక్కడి ప్రజలు చెబుతారు.శివయ్య మాత్రమే కాదు అందంగా చెక్కిన శిల్పాలు ఇక్కడ కనువిందు చేస్తాయి.
ఇక్కడ నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, శివరాత్రి సమయంలో కాస్త ప్రవాహం తగ్గుతుంది.ఆ సమయంలో భక్తులు నదిలోకి దిగి పూజలు చేస్తూ ఉంటారు.కార్తిక మాసం, సమారాధన సమయంలో మాత్రం భక్తులు ఒడ్డుపై నిలబడి పూజలు చేస్తూ ఉంటారు.