తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది బీజేపీ.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్న సంకేతాలను ఇచ్చిన బీజేపీ కి పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తుంది.
దీనిలో భాగంగానే తెలంగాణ బీజేపీ లో కీలకంగా ఉన్న నాయకులు అందరిని మరింత యాక్టీవ్ చేసే పనిలో పడింది.దీనిలో భాగంగానే తెలంగాణ బిజెపిలో కీలకంగా ఉన్న ఈటెల రాజేందర్, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, ఈ మధ్యనే పార్టీలో చేరి మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించారు.
అయితే ఈటెల రాజేందర్ తో బిజెపి అగ్ర నేతలు ప్రత్యేకంగా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.బిజెపి అగ్రనేత అమిత్ షా, ఈటెల రాజేందర్ తో సమావేశం అయిన సందర్భంగా మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఓటమి చెందడానికి గల కారణాలను, రాబోయే రోజుల్లో బిజెపి ఎటువంటి వ్యూహాలను అమలు చేయడం ద్వారా టిఆర్ఎస్ పై పైచేయి సాధించవచ్చు అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారట.
దీంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ముందుగానే ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనే దానిపైన అమిత్ షా ఈటెల రాజేందర్ కు పలు సూచనలు చేశారట.ఇక మరోవైపు బిజెపి నేతల ఫోన్లను టాపింగ్ చేస్తున్నారనే అంశాన్ని కూడా అమిత్ షా దృష్టికి ఈటెల రాజేందర్ తీసుకెళ్లారట.
దీనిపై తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈటెల రాజేందర్ ఢిల్లీ పర్యటనలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , సంస్థగత వ్యవహారాల కార్యదర్శి డిఎల్ సంతోష్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సునీల్ బాన్సాల్, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ల తోను రాజేందర్ భేటీ అయ్యారు.వీరందరి భేటీలోనూ ప్రధానంగా తెలంగాణలో రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలని విషయంపైనే పూర్తిస్థాయిలో రాజేందర్ కు అనేక సూచనలు చేశారట.







