హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు ఇంటిపై దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో అరవింద్ ఇంటి ఫర్నిచర్ తో పాటు కార్లు ధ్వంసం అయ్యాయి.కాగా ఈ ఘటనలో టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్, జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్ పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దాడులకు పాల్పడిన టీఆర్ఎస్ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు.







