సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడైనా చిన్న, మధ్య మరియు పెద్ద హీరోలు అని వారి వారి మార్కెట్ రేంజ్ ని బట్టి ఒక వివరణ ఉంటుంది.ఈ హీరో మీడియం రేంజ్( Medium Range Heros ) ఇంతే బడ్జెట్ పెట్టాలి, లేదంటే పెద్ద హీరో కాబట్టి హై బడ్జెట్ ఉండాలి, చిన్న సినిమాలను ఏదోలా నడిపించాలి అంటూ ఒక స్ట్రాటజీ తో అందరు ఉంటారు.
ఇక స్టార్ హీరోస్ మన ఇండస్ట్రీ లో ప్రస్తుతం వంద కోట్ల మార్కెట్ దాటినా హీరోలే అని చెప్పాలి.వంద కోట్ల మార్కెట్ దాటినా హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ వంటి కుర్ర హీరోలు, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు మాత్రమే.
వీరి తర్వాత స్థాయిలో విజయ్ దేవరకొండ, నాని, నితిన్, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య వంటి కుర్ర హీరోలు రవి తేజ వంటి సీనియర్ హీరోలు వస్తారు.
వీరి సినిమాల బడ్జెట్ 40 కోట్ల వరకు మాత్రమే ఉంటుంది.అంత కన్నా బడ్జెట్ దాటితే మార్కెట్ చేయలేము అనేది నిర్మాతల వాదన.కానీ ఇప్పుడు వీరి మార్కెట్ మంత్రాన్ని తలకిందులు చేస్తున్నారు మన సెకండ్ రేంజ్ హీరోలంతా.
తమ తెలివి మొత్తం వాడి నిర్మాతల నుంచి బడ్జెట్ పెంచి వారి మార్కెట్ పరిధిని కూడా పెంచుకుంటున్నారు.ఈ లిస్ట్ లో నాని( Hero Nani ) మంచి స్పీడ్ మీద ఉన్నాడు.
తన దసరా సినిమాకు( Dasara Movie ) ముందు కేవలం 35 నుంచి 40 కోట్ల మార్కెట్ ఉన్న ఈ హీరో దసరా కు మాత్రం 65 కోట్లు పెట్టించాడు.అది విజయం సాధించడం తో 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కాయి.
ఇక విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గురించి చెప్పేయాల్సి ఏముంటుంది చెప్పండి.ఈ హీరో సినిమాను ప్రమోట్ చేసినట్టుగా మార్కెట్ లో మరెవరు చేయలేరు.లైగర్ సినిమాకు( Liger Movie ) బోలెడంత డబ్బు పెట్టించాడు కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు.ఒకవేళ ఈ సినిమా హిట్ అయ్యి ఉంటె బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసే వాడు.
ఇక చాల ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్న రవి తేజ( Raviteja ) మాత్రం స్టార్ హీరో ల లిస్ట్ లో మీడియం రేంజ్ బడ్జెట్ తోనే ఇప్పటి వరకు సరిపెట్టుకుంటూ వచ్చాడు.కానీ టైగర్ నాగేశ్వర రావు( Tiger Nageswara Rao ) సినిమాతో ఈ మార్క్ ఇక ఉండదు.
ఎందుకంటే తన మార్కెట్ రేంజ్ కన్నా కూడా బడ్జెట్ చాల ఎక్కువగా ఖర్చు అయ్యింది ఈ సినిమా కోసం.మరి బడ్జెట్ పెరిగితే రీచ్ కూడా పెరుగుతుంది అని నమ్ముతున్నారు ఈ హీరోలు.