విష్ణు సహస్రనామ స్మరణలతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే కనీసం రోజుకు ఒక్కసారైనా విష్ణు సహస్రనామ( Sri Vishnu Sahasranama Stotram ) పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చుని పండితులు చెబుతూ ఉన్నారు.విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణా చేసిన అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని చెబుతున్నారు.

 Sri Vishnu Sahasranama Stotram , Lord Vishu, Devotional, Bhagavad Gita , Dharm-TeluguStop.com

విష్ణు సహస్రనామ స్తోత్రములో ప్రతి నామము అద్భుతము.మన నిత్యజీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

భారత యుద్ధం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడితో కలిసి అంపశయ్య పై ఉన్న భీష్మచార్యుని దగ్గరకు ధర్మరాజు వెళ్తాడు.మహాభారత యుద్ధానికి దుర్యోధనుడు ఎంత కారణమో తను అంతే కారణమని రాజ్యంతే నరకం ధ్రువమ్ అని రాజ్యపాలన చేసిన వాళ్లు ఎంతటి వాళ్ళకైనా నరకం తప్పదని శాస్త్ర వచనం ధర్మరాజుని మనసులోకి వచ్చింది.

తను ఆ సిద్ధాంతం నుంచి తప్పించుకోవాలని ధర్మ తత్వాన్ని భీష్ముని ద్వారా తెలుసుకోవాలని తాతను ఆశ్రయించాడు.మానవుడు తరించడానికి గీత శాస్త్రం, సహస్రనామం రెండే మార్గాలని భీష్ముడు బోధించాడు.

ఆ మహా సంగ్రామం పాప పంకిలం నుంచి తప్పించుకోవాలని భావించిన ధర్మరాజుకు భీష్ముడు చాలా విషయాలను చెప్పాడు.అందులో సహస్రనామం కూడా ఒకటి అని పండితులు చెబుతున్నారు.

భగవద్గీత( Bhagavad Gita ) విష్ణు సహస్రనామం రెండు భారతంలోని చివరి పర్వంలో వెల్లడించారు.దుర్యోధనుడు తొమ్మిదవ పర్వంలో మరణిస్తే ఇంకా తొమ్మిది పర్వాలు మిగిలి ఉండడం వెనుక గొప్ప అంతరార్థం ఉంది.

Telugu Bhagavad Gita, Bhakti, Devotional, Dharmaraju, Lord Krishna, Lord Vishu,

కేవలం దుర్యోధనునీ మరణంతో భారతం ముగిసిపోలేదు.యుద్ధం తర్వాత మానవుడు తరించడానికి చెప్పినా గొప్ప విషయాల్లో శ్రీ విష్ణు సహస్రనామం ఒకటి అని పండితులు చెబుతున్నారు.విష్ణు సహస్రనామాలను చదివేటప్పుడు ఏదో ఆశించి ఈ పని అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.అయితే కొంత మంది తప్పులు లేకుండా చదవడం కష్టం.మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే దేవుణ్ణి ఎలా పిలిచినా పలుకుతాడు.భక్తితో దేవుని కొలిచేదే ముఖ్యం అని కూడా నిపుణులు చెబుతున్నారు.

సహస్రనామాలు చదవలేని వాళ్ళు కృష్ణా రామా ఇలా చిన్నచిన్న పదాలతో నామస్మరణం చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube